ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒంటె పిల్ల ప్రశ్నలు

ABN, First Publish Date - 2020-12-10T06:22:34+05:30

ఒక ఎడారిలో ఒక ఒంటె దాని పిల్ల నడుస్తూ వెళుతున్నాయి. అలసిపోవడంతో విశ్రాంతి తీసుకునేందుకు ఒక చోట

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక ఎడారిలో ఒక ఒంటె దాని పిల్ల నడుస్తూ వెళుతున్నాయి. అలసిపోవడంతో విశ్రాంతి తీసుకునేందుకు ఒక చోట ఆగాయి. అప్పుడు పిల్ల ఒంటె తల్లి ఒంటెను ‘అమ్మా! మన మూపురం ఎందుకు అంత పెద్దగా ఉంటుంది?’ అని అడిగింది. దానికి తల్లి ఒంటె ‘నీళ్లను దాచుకోవడానికి మనకు మూపురం తోడ్పడతుంది. మూపురం ఉండడం వల్లనే చుక్క నీరు దొరకని ఎడారిలో కూడా బతకగలుగుతున్నాం’ అని చెప్పింది. ‘అవునా’ అనుకొని ‘మన పాదాలు ఎందుకు గుండ్రంగా ఉంటాయి?’ అని ప్రశ్నించింది పిల్ల ఒంటె.


‘ఎడారిలో ఇసుకలో ఏ ఇబ్బంది లేకుండా నడవడానికి వీలుగా మన పాదాలు గుండ్రంగా ఉంటాయి’అని చెప్పింది. ‘సరే. మరి మన కనురెప్పలు పెద్దవిగా ఉండడానికి కారణం ఏంటి?’ అంటుది. అందుకు తల్లి ఒంటె ‘ఎందుకంటే ఎడారిలో నడిచేటప్పుడు వడగాలులు, ఇసుక తుఫాన్‌ల సమయంలో మన కళ్లలో ఇసుక పడకుండా పెద్ద కనురెప్పలు ఉంటాయి’ అని చెప్పి, పిల్లను వెంటేసుకొని తల్లి ఒంటె తిరిగి తమ ప్రయాణాన్ని మొదలెడుతుంది.


Updated Date - 2020-12-10T06:22:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising