ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తోటమాలికి బీర్బల్‌ సాయం!

ABN, First Publish Date - 2020-06-30T05:30:00+05:30

ఒకరోజు అక్బర్‌ తోటలో పచార్లు చేస్తూ రాయి తగిలి కింద పడి పోయాడు. సేవకుల ముందు కింద పడిపోవడాన్ని అక్బర్‌ అవమానంగా భావించాడు. నిర్లక్ష్యంగా ఉన్నందుకు తోటమాలిని వెంటనే బంధించి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒకరోజు అక్బర్‌ తోటలో పచార్లు చేస్తూ రాయి తగిలి కింద పడి పోయాడు. సేవకుల ముందు కింద పడిపోవడాన్ని అక్బర్‌ అవమానంగా భావించాడు. నిర్లక్ష్యంగా ఉన్నందుకు తోటమాలిని వెంటనే బంధించి, ఉరి తీయమని ఆజ్ఞాపించాడు. బీర్బల్‌కు జరిగిన విషయం తెలిసింది. తోట మాలిని బంధించి ఉంచిన జైలుకు వెళ్లాడు. అక్కడ తోటమాలి చెవిలో రహస్యంగా ఒక మాట చెప్పి వచ్చాడు. మరుసటి రోజు తోటమాలిని ఉరితీసేందుకు అంతా సిద్ధం చేశారు. చివరి కోరిక ఏదైనా ఉంటే అడగమని జైలు సిబ్బంది అడిగారు. అప్పుడు తోటమాలి ‘‘ఒక్కసారి రాజు గారిని చూస్తాను’’ అని అన్నాడు. అందుకు సరేనన్న సిబ్బంది రాజు కొలువుదీరి ఉన్న సభకు తీసుకెళ్లారు. వెంటనే తోటమాలి రాజు దగ్గరకు వెళ్లి ఆయన కాళ్లపై ఉమ్మి వేశాడు. జరిగింది చూసి సభికులందరూ ఆశ్చర్యపోయారు.


‘‘ఏమిటీ పిచ్చి పని!’’ అంటూ రాజు మరింత ఆగ్రహానికి గురయ్యాడు. అప్పుడు బీర్బల్‌ కలగజేసుకుని ‘‘జహాపనా! మీరు తెలివితక్కువ కారణంతో ఉరి తీస్తున్నారని తోటమాలి బాధపడుతున్నాడు. మీ నిర్ణయాన్ని ప్రజలు సైతం విమర్శించే అవకాశం ఉంది. అందుకే ఉరి తీయడానికి సరైన కారణం కావాలని అలా చేశాడు’’ అని వివరించాడు. అక్బర్‌కు విషయం అర్థమై, తోటమాలిని క్షమించి వదిలేశాడు.


Updated Date - 2020-06-30T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising