ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్బర్‌-పరిచారకుడు

ABN, First Publish Date - 2020-12-05T05:30:00+05:30

ఒకరోజు అక్బర్‌ ఉదయాన్నే నిద్రలేవగానే పరిచారకుడి ముఖం చూశాడు. పరిచారుకుడు కూడా మహారాజు ముఖం చూశాడు. ఆ రోజు అక్బర్‌కు ఏదీ కలిసి రాలేదు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒకరోజు అక్బర్‌ ఉదయాన్నే నిద్రలేవగానే పరిచారకుడి ముఖం చూశాడు. పరిచారుకుడు కూడా మహారాజు ముఖం చూశాడు. ఆ రోజు అక్బర్‌కు ఏదీ కలిసి రాలేదు. ఏ పని మొదలుపెట్టినా పూర్తి కాలేదు. అంతేకాకుండా తోటలో నడుస్తుండగా కిందపడి దెబ్బ తగిలింది. ‘ఈ రోజు ఎందుకిలా జరిగింది’ అని ఆలోచిస్తుండగా పొద్దున్నే పరిచారకుడి ముఖం చూసిన విషయం అక్బర్‌కు గుర్తొచ్చింది. ‘వాడి ముఖం చూడటం వల్లనే ఇలా జరిగింది’ అనుకుంటూ వెంటనే ఆ పరిచారకుడిని ఉరితీయండని భటులను ఆదేశించాడు. విషయం తెలిసిన పరిచారకుడు ‘నన్ను రక్షించండి’ అంటూ బీర్బల్‌ దగ్గరకు పరుగెత్తాడు. బీర్బల్‌ ఆ పరిచారకుడిని తీసుకుని సభకు వెళ్లాడు. సేవకుడిని చూడటంతోనే అక్బర్‌ ‘‘వాణ్ణి ఇంకా ఉరితీయలేదా?’’ అని కోపంగా ప్రశ్నించాడు. అప్పుడు బీర్బల్‌ ‘‘మహారాజా! మీరు వేసిన శిక్షను ఆనందంగా అనుభవించడానికి అతడు సిద్ధంగా ఉన్నాడు. అయితే వాడికి ఓ సమస్య ఉందట. అది మీరే తీర్చాలట’’ అన్నాడు. ‘‘ఏంటది?’’ అన్నాడు అక్బర్‌. ‘‘ఉదయాన్నే మీరు వాడి ముఖం చూసినందుకు మీకు దెబ్బతగిలింది. కానీ వాడు మీ ముఖం చూసినందకు మరణదండన పడింది. కాబట్టి మీకు ఏ శిక్ష విధించాలో చెప్పమంటున్నాడు’’ అని చెప్పాడు బీర్బల్‌. అప్పుడు అక్బర్‌ తన తప్పు తెలుసుకొని ఆ పరిచారకుడి మరణదండన రద్దు చేసి, అతడికి కానుకలు ఇచ్చి పంపించాడు.

Updated Date - 2020-12-05T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising