ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గాజులు-మెట్లు

ABN, First Publish Date - 2020-06-04T05:30:00+05:30

ఒకరోజు అక్బర్‌ సభలో బీర్బల్‌ను ఉద్దేశించి ‘‘మీ భార్య చేతికి ఎన్ని గాజులున్నాయో చెప్పు?’’ అని ప్రశ్నించాడు. ‘‘లేదు జహాపనా! నేను చెప్పలేను’’ అన్నాడు బీర్బల్‌. ‘‘చెప్పలేవా? ప్రతిరోజూ ఆమె చేతులను చూస్తూనే ఉంటావు. ఆమె ఎన్ని గాజులు వేసుకుందో చెప్పలేవా?’’ అని తిరిగి ప్రశ్నించాడు అక్బర్‌...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒకరోజు అక్బర్‌ సభలో బీర్బల్‌ను ఉద్దేశించి ‘‘మీ భార్య చేతికి ఎన్ని గాజులున్నాయో చెప్పు?’’ అని ప్రశ్నించాడు. ‘‘లేదు జహాపనా! నేను చెప్పలేను’’ అన్నాడు బీర్బల్‌. ‘‘చెప్పలేవా? ప్రతిరోజూ ఆమె చేతులను చూస్తూనే ఉంటావు. ఆమె ఎన్ని గాజులు వేసుకుందో చెప్పలేవా?’’ అని తిరిగి ప్రశ్నించాడు అక్బర్‌. అప్పుడు బీర్బల్‌ ‘‘మహారాజా! ఒకసారి తోటకు వెళదాం వస్తారా? నేను ఎందుకు చెప్పలేనో అక్కడ వివరిస్తాను’’ అని అన్నాడు. దాంతో సరేనని బీర్బల్‌తో కలిసి తోటకు బయలుదేరాడు అక్బర్‌. ఇద్దరూ కలిసి మెట్లపై నడుచుకుంటూ తోటలోకి వెళ్లారు. అప్పుడు బీర్బల్‌ ‘‘మహారాజా! మీరు రోజూ తోటకు మెట్లపై నుంచి నడుచుకుంటూ వస్తుంటారు కదా! ఎన్ని మెట్లు ఉన్నాయో చెప్పగలరా?’’ అంటూ ప్రశ్నించాడు. ఆ ప్రశ్న విన్న అక్బర్‌ చిరునవ్వు నవ్వి, తను వేసిన ప్రశ్న ఎలాంటిదో అర్థం చేసుకున్నాడు. బీర్బల్‌ చతురతను మెచ్చుకున్నాడు.


Updated Date - 2020-06-04T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising