ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పున్నమి చంద్రుడు!

ABN, First Publish Date - 2020-05-31T05:30:00+05:30

పర్షియా రాజు ఆహ్వానం మేరకు బీర్బల్‌ ఆ రాజ్యాన్ని సందర్శించాడు. బీర్బల్‌ గౌరవార్థం అనేక విందులు, వినోదాలు ఏర్పాటు చేశారు. అనేక బహుమతులతో సత్కరించారు. తిరిగి స్వదేశానికి పయనమవుతుండగా ఒక వ్యక్తి బీర్బల్‌ను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పర్షియా రాజు ఆహ్వానం మేరకు బీర్బల్‌ ఆ రాజ్యాన్ని సందర్శించాడు. బీర్బల్‌ గౌరవార్థం అనేక విందులు, వినోదాలు ఏర్పాటు చేశారు. అనేక బహుమతులతో సత్కరించారు. తిరిగి స్వదేశానికి పయనమవుతుండగా ఒక వ్యక్తి బీర్బల్‌ను ‘‘మా రాజును మీ రాజుతో ఎలా పోలుస్తారో చెప్పండి?’’ అని ఒక ప్రశ్న అడిగాడు. అప్పుడు బీర్బల్‌ ‘‘మీ రాజు పున్నమి చంద్రుడి లాంటి వారు. మా రాజు నెలవంక లాంటివారు’’ అన్నాడు. బీర్బల్‌ వివరణకు పర్షియన్లు సంతోషించారు. తరువాత బీర్బల్‌ స్వదేశం చేరుకున్నాడు. వేగుల ద్వారా బీర్బల్‌ అన్న విషయం అక్బర్‌ మహారాజుకు తెలిసింది. వెంటనే బీర్బల్‌ను పిలిపించాడు.


‘‘నువ్వు ఎలా నీ రాజుని తగ్గించి మాట్లాడుతావు. నువ్వు దేశద్రోహివి’’ అన్నాడు బీర్బల్‌తో కోపంగా. బీర్బల్‌ మాత్రం శాంతంగా ‘‘జహాపనా! నేను మిమ్మల్ని తగ్గించలేదు. రోజులు గడిచే కొద్దీ పున్నమి చంద్రుడు తగ్గిపోతాడు. నెలవంక రోజురోజుకు పెరుగుకుంటూ వస్తుంది. నెలవంకలా మీ ప్రాభవం రోజురోజూ పెరుగుతూ వస్తోంది. పర్షియా రాజు ప్రాభవం తగ్గిపోతోంది. నేను అన్నదానికి అర్థం అది’’ అని సెలవిచ్చాడు. బీర్బల్‌ చెప్పిన విషయంతో అక్బర్‌ సంతోషించాడు. 


Updated Date - 2020-05-31T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising