ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అరచేతులు ఎందుకలా?

ABN, First Publish Date - 2020-11-13T05:30:00+05:30

బీర్బల్‌ తన వాక్చాతుర్యంతో అక్బర్‌కు బాగా దగ్గరయ్యాడు. ఒకరోజు అక్బర్‌ మహారాజు బీర్బల్‌తో కలిసి సాయంత్రం వేళ పచార్లు చేస్తున్న సమయంలో అరచేతుల్లో వెంట్రుకలు ఎందుకు లేవని సందేహం వచ్చింది. వెంటనే ‘‘బీర్బల్‌... అరచేతుల్లో వెంట్రుకలు ఎందుకు లేవో చెప్పు?’’ అని అడిగాడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీర్బల్‌ తన వాక్చాతుర్యంతో అక్బర్‌కు బాగా దగ్గరయ్యాడు. ఒకరోజు అక్బర్‌ మహారాజు బీర్బల్‌తో కలిసి సాయంత్రం వేళ పచార్లు చేస్తున్న సమయంలో అరచేతుల్లో వెంట్రుకలు ఎందుకు లేవని సందేహం వచ్చింది. వెంటనే ‘‘బీర్బల్‌... అరచేతుల్లో వెంట్రుకలు ఎందుకు లేవో చెప్పు?’’ అని అడిగాడు. ‘‘జహాపనా! ప్రతిరోజు ఎంతో మంది పేదలకు మీరు రెండు చేతులతో దానం చేస్తున్నారు. అలాంటి చేతుల్లో ఇక వెంట్రుకలు ఎలా ఉంటాయి?’’ అని సమాధానం ఇచ్చాడు బీర్బల్‌. ఆ సమాధానం విన్న అక్బర్‌ సంతోషించాడు. కానీ వెంటనే అక్బర్‌కు మరో సందేహం వచ్చింది. ‘‘మరి నీ చేతుల్లో కూడా వెంట్రుకలు లేవు కదా?’’ అని అడిగాడు అక్బర్‌. అప్పుడు బీర్బల్‌ ‘‘మహారాజా! మీరిచ్చే బహుమతులను రోజూ తీసుకోవడం వల్ల వెంట్రుకలు లేకుండా పోయాయి’’ అని అన్నాడు. బీర్బల్‌ తెలివైన సమాధానాన్ని అక్బర్‌ మెచ్చుకున్నాడు. అయితే అక్కడితో ఊరుకోకుండా ‘‘రాజ్యంలో అందరి చేతుల్లో వెంట్రుకలు లేవు కదా! దానికేమంటావు?’’ అని కుతూహులంగా అడిగాడు. ‘‘మీ దగ్గర నుంచి నేను బహుమతులు తీసుకున్నప్పుడల్లా అందరూ అసూయతో చేతులు రుద్దుకుంటున్నారు. దానివల్ల వెంట్రుకలు లేకుండా పోయాయి’’ అని అన్నాడు బీర్బల్‌. ఆ సమాధానాలతో అక్బర్‌ సంతృప్తి చెందాడు. 

Updated Date - 2020-11-13T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising