ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాప ధైర్యానికి బీర్బల్‌ కానుక!

ABN, First Publish Date - 2020-08-18T05:50:08+05:30

అక్బర్‌ రాజ్యంలో అంధుడైన ఒక సాధువు నివసించేవాడు. ఆయన జ్యోతిషం, భవిష్యత్తు గురించి బాగా చెబుతాడని ప్రజలు నమ్మేవారు. ఒకరోజు పొరుగూరి నుంచి ఇద్దరు వాళ్ల మేనకోడలును తీసుకుని ఆ సాధువు దగ్గరకు వచ్చారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అక్బర్‌ రాజ్యంలో అంధుడైన ఒక సాధువు నివసించేవాడు. ఆయన జ్యోతిషం, భవిష్యత్తు గురించి బాగా చెబుతాడని ప్రజలు నమ్మేవారు. ఒకరోజు పొరుగూరి నుంచి ఇద్దరు వాళ్ల మేనకోడలును తీసుకుని ఆ సాధువు దగ్గరకు వచ్చారు. ఆ పాప తల్లిదండ్రులిద్దరినీ ఆమె కళ్లముందే చంపేశారు. అప్పటి నుంచి ఆ పాప బాగోగులన్నీ ఆమె మామయ్య చూసుకుంటున్నాడు. ఆ సాధువును చూడగానే పాప ‘అతడే నేరస్థుడు’ అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టింది.


పాప అరుపులు విన్న సాధువు వెంటనే ‘ఆమెను ఇక్కడి నుంచి తీసుకువెళ్లండి’ అని అన్నాడు. ఆ రోజంతా పాప ‘ఆ సాధువే నేరస్థుడు’ అంటూ  ఎడుస్తూ ఉంది. దాంతో ఆ దంపతులు పాప అబద్ధం చెప్పడం లేదని నిర్ణయించుకుని, సహాయం కోరుతూ బీర్బల్‌ దగ్గరకు వచ్చి, జరిగినదంతా చెప్పారు. మరుసటి రోజు బీర్బల్‌ ఆ సాధువును సభకు రమ్మని ఆహ్వానించాడు. సాధువు సభలో ప్రవేశించగానే ఓ వ్యక్తి కత్తితో సాధువు తలను నరకబోయాడు. అది గమనించిన సాధువు తన దగ్గర ఉన్న కత్తితో అడ్డుకుని, అతనితో తలపడ్డాడు. దాంతో ఆ సాధువు అంధుడు కాదని తేలిపోయింది. అతణ్ణి వెంటనే ఉరితీయండని అక్బర్‌ ఆజ్ఞాపించాడు. ఆంతేకాదు ఆ పాప ధైర్యానికి మెచ్చి బహుమతి ఇచ్చాడు.


Updated Date - 2020-08-18T05:50:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising