ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళలు ఎందుకు భరించాలి?

ABN, First Publish Date - 2020-05-24T05:30:00+05:30

‘‘మహిళల్ని... ఆ మాటకొస్తే ఒకరిని కొట్టే అధికారం ఎవరికీ లేదు. మానసికంగానైనా, శారీరకంగానైనా! మహిళలు ఎవరైనా గృహహింసను ఎందుకు సహించాలి? భరించాలి? ఈ పరిస్థితి మారాలి. వెంటనే మార్పు రావాలి’’ అంటున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘మహిళల్ని... ఆ మాటకొస్తే ఒకరిని కొట్టే అధికారం ఎవరికీ లేదు. మానసికంగానైనా, శారీరకంగానైనా! మహిళలు ఎవరైనా గృహహింసను ఎందుకు సహించాలి? భరించాలి? ఈ పరిస్థితి మారాలి. వెంటనే మార్పు రావాలి’’ అంటున్నారు కృతీ సనన్‌. పదకొండో తరగతిలో ఉండగా గృహహింస నేపథ్యంలోరాసిన కవితను ఇటీవల సోషల్‌ మీడియాలో ఆమె చదివి వినిపించారు.


కృతీ సనన్‌ మాట్లాడుతూ ‘‘లాక్‌డౌన్‌ కాలంలో సుమారు 35 నుంచి 40 శాతం వరకూ గృహహింస కేసులు పెరిగాయని వార్తల్లో చదివా. పంజాబ్‌ రాష్ట్రంలోనే 700 కేసులు ఉన్నాయట. ఈ దారుణాలకు వ్యతిరేకంగా మహిళలు ధైర్యంగా నిలబడాలి. ముందుకు రావడానికి భయపడుతున్నారని అర్థం చేసుకోగలను. అయితే, ధైర్యంగా నిలబడి సరైన నిర్ణయం తీసుకొంటే, అది వాళ్ల జీవితాన్ని అందంగా మారుస్తుంది. నేను ఈ విషయం గురించి మాట్లాడడం వల్ల గృహహింసలో చిక్కుకున్న ఒక్క మహిళ అయినా స్ఫూర్తి పొందితే సంతోషిస్తా. నేను పదకొండో తగరతి చదవేటప్పుడు ఢిల్లీలోని మా ఇంటికి ఓ మహిళ పని చేయడానికి వచ్చేది. ఒక రోజు తన భర్త కొట్టడంతో ఆమె అమ్మ దగ్గర ఏడ్చింది. అప్పుడు తను ఎలా ఫీలవుతుందనేది ఆలోచించి కవిత రాశా. అమ్మ ఆమెకు ఓ సలహా ఇచ్చింది. ఆవిడ తను పాటించలేనని చెప్పింది. ఇప్పుడు నేను ఆ కాలానికి వెళ్లగలిగితే... ఆ కవితకు ముగింపు మరోలా ఇచ్చేదాన్ని’’ అన్నారు కృతి.




హాలీవుడ్‌ నటి సల్మా హయక్‌ కూడా గృహహింసకు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో ఉద్యమం ప్రారంభించారు. ‘‘కరోనా ప్రమాదం నుంచి కాపాడుకోవడానికి ఇంటిలోనే ఉంటున్నాం. అటువంటిది ఇల్లే ప్రమాదం అయితే?’’ అని ఆమె ప్రశ్నించారు. మహిళలకు అండగా నిలబడమని ఫాలోయర్లకు హయక్‌ పిలుపునిచ్చారు. ‘స్టాండ్‌ విత్‌ విమెన్‌’ హ్యాష్‌ట్యాగ్‌తో క్యాంపైన్‌ షురూ చేశారు. గృహహింసకు వ్యతిరేకంగా పోరాడుతున్న సంస్థలకు ఆర్థిక సహాయం చేస్తామని ఆమె చెప్పారు.


Updated Date - 2020-05-24T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising