ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బూట్లు ఇంటి బయటే...

ABN, First Publish Date - 2020-04-07T05:30:00+05:30

కరచాలనం ద్వారా కరోనా వైరస్‌ సోకే ప్రమాదం ఉందనే వార్తలు రావడంతో, బూట్లను తాకించి అభివాదం చేసే వీడియోలు, మీమ్‌లు సోషల్‌మీడియాలో అందరినీ నవ్వించాయి. అయితే తాజాగా జరిపిన ఓ అధ్యయనంలో బూట్ల విషయంలోనూ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరచాలనం ద్వారా కరోనా వైరస్‌ సోకే ప్రమాదం ఉందనే వార్తలు రావడంతో, బూట్లను తాకించి అభివాదం చేసే వీడియోలు, మీమ్‌లు సోషల్‌మీడియాలో అందరినీ నవ్వించాయి. అయితే తాజాగా జరిపిన ఓ అధ్యయనంలో బూట్ల విషయంలోనూ జాగ్రత్త పడాలని తేలింది. 


కరోనా వైరస్‌ వేర్వేరు ఉపరితలాల మీద వేర్వేరు సమయాల పాటు సజీవంగా ఉంటుంది. మార్కెట్లు, ఆస్పత్రులు లాంటి జనసమ్మర్దం ఎక్కువగా ఉన్న ప్రదేశంలో బూట్లతో నడిచినప్పుడు ఈ వైరస్‌ బూట్లకూ అంటుకునే ప్రమాదం ఉంది. సాధారణంగా బూట్లు లెదర్‌, ప్లాస్టిక్‌, రబ్బర్‌ మెటీరియల్స్‌తో తయారవుతూ ఉంటాయి. కరోనా సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, లేదా తుమ్మినప్పుడు తుంపర్లు బూట్ల మీద పడే ప్రమాదం ఉంటుంది. ఇలా పడిన కరోనా వైరస్‌ సుమారు ఐదు రోజుల పాటు సజీవంగా ఉంటుంది. ఇవే బూట్లతో నేరుగా ఇంటికి చేరుకుంటే, వాటి ద్వారా వైరస్‌ ఇంట్లోని కుటుంబసభ్యులకు సోకే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించాలి.

  1. ఇంటికి చేరుకున్న వెంటనే బూట్లు, లేదా చెప్పులను ఇంటి బయటే వదిలేయాలి.
  2. జనసమ్మర్ధం ఎక్కువగా ఉన్న ప్రాంతానికి వెళ్లి వచ్చిన వెంటనే బూట్లను సబ్బునీటితో కడగాలి.
  3. బూట్లు వాషింగ్‌మిషన్‌లో ఉతికే వీలున్న రకానికి చెందినవైతే, వాషింగ్‌మిషన్‌లో వేయాలి.
  4. లెదర్‌ బూట్లను డిస్‌ ఇన్‌ఫెక్టెంట్‌తో శుభ్రం చేయాలి.
  5. గుమ్మంలో శుభ్రమైన చెప్పులు ఉంచుకుని, బయట నుంచి ఇంటికి చేరుకున్న వెంటనే ధరించిన చెప్పులు లేదా బూట్లు వదిలేసి, శుభ్రమైన చెప్పులు ధరించి ఇంట్లోకి అడుగు పెట్టాలి.
  6. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు చెప్పులకు బదులుగా బూట్లు ధరించడం మేలు.

Updated Date - 2020-04-07T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising