ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ జ్యూస్‌లు మేలు!

ABN, First Publish Date - 2020-08-05T05:59:15+05:30

కరోనా నేపథ్యంలో అందరూ పోషకాహారంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచే ఆహారంపై దృష్టి సారించారు. ఇమ్యూనిటీని పెంచే జ్యూస్‌లు రోజూ ఆహారంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా నేపథ్యంలో అందరూ పోషకాహారంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచే ఆహారంపై దృష్టి సారించారు. ఇమ్యూనిటీని పెంచే జ్యూస్‌లు రోజూ ఆహారంలో తీసుకోవాలంటున్నారు పోషకాహార నిపుణులు. శరీరంలోని విషపదార్థాలను తొలగించి, రోగనిరోధక శక్తిని పెంచే కొన్ని జ్యూసులివి...



ఏబీసీ డిటాక్స్‌ డ్రింక్‌: ఆపిల్‌, బీట్‌రూట్‌, క్యారెట్‌ మిశ్రమాన్ని ‘ఏబీసీ డీటాక్స్‌ డ్రింక్‌’ అంటారు. ఈ మూడింటి మిశ్రమం లివర్‌, కిడ్నీ, పేగులు, చర్మంలోని విష పదార్థాలను తొలగిస్తుంది. వాటి పనితీరును మెరుగుపరుస్తుంది. 


బీట్‌రూట్‌: బీట్‌రూట్‌లో విటమిన్‌ సి, పొటాషియం, మెగ్నీషియం, ఫొలేట్‌ లాంటి పోషకాలు అధిక మోతాదులో ఉన్నాయి. దీనిలోని లైకోపిన్‌, ఆంథోసైయనిన్స్‌ లాంటి యాంటీ ఆక్సిడెంట్‌లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాదు ఇవి ఒంట్లో చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలను నియంత్రిస్తాయి. బీట్‌రూట్‌ రసంలో వాపును తగ్గించే గుణం ఉండడం వల్ల కాలేయానికి మేలు చేస్తుంది. 


ఆపిల్‌: దీనిలో విటమిన్‌ ఎ, బీ1, బీ2, బీ6, ఫొలేట్‌, నియాసిన్‌, జింక్‌, కాపర్‌, పొటాషియం, లాంటి పలు రకాల ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్నాయి. ఇవి కాలేయంలో ఉండే విషపదార్థాలను తొలగిస్తాయి. ఆపిల్‌లో ఉండే విటమిన్‌ సి రోగ నిరోధకశక్తిని పెంచటంతో పాటు నరాల వ్యవస్థను బలోపేతం చేస్తుంది. 


క్యారెట్‌: క్యారెట్‌లో విటమిన్‌ ఎ, బీ1, బీ2, బీ3, నియాసిన్‌, ఫొలేట్‌, పాంటోథెనిక్‌ యాసిడ్‌, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం,సెలీనియం లాంటి పోషకాలతో పాటు పీచు పుష్కలంగా ఉంటుంది. దీనిలోని బీటా కెరోటీన్‌ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్‌ ఎ కాలేయంలోని విషపదార్థాలను, కొవ్వును తొలగిస్తుంది.

Updated Date - 2020-08-05T05:59:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising