ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీటిని కలిపి తింటే మేలు!

ABN, First Publish Date - 2020-12-24T05:33:58+05:30

ఆహారంలో చిన్న చిన్న మార్పులు, చేర్పులతో ఎక్కువగా కష్టపడకుండానే బరువు తగ్గే అవకాశం ఉంది. రెండు రకాల ఆహారపదార్థాలను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆహారంలో చిన్న చిన్న మార్పులు, చేర్పులతో ఎక్కువగా కష్టపడకుండానే బరువు తగ్గే అవకాశం ఉంది. రెండు రకాల ఆహారపదార్థాలను కలిపి తినడం వల్ల ఎక్కువ పోషకాలు అందుతాయి. పొట్ట నిండుగా ఉంటుంది. క్యాలరీలు ఎక్కువగా ఖర్చవుతాయి అంటున్నారు ఆహార నిపుణులు. అలాంటి కొన్ని ఫుడ్‌ కాంబినేషన్స్‌ ఏమిటంటే... 


గుడ్లు, పాలకూర: గుడ్లలో ప్రొటీన్‌ ఎక్కువగా లభిస్తుంది. బరువు తగ్గడానికి తోడ్పడే ఆహారం కూడా. ఆమ్లెట్‌లో పాలకూర కూడా కలిపి తింటే మంచిది. పాలకూరలోని ఐరన్‌, గుడ్డులోని ప్రొటీన్‌ బరువు తగ్గడంలో తోడ్పడతాయి.

ఆకుకూరలు, ఆలివ్‌ నూనె: స్నాక్‌గా ఆకుకూరల సలాడ్‌, అందులో కొన్ని చుక్కల ఆలివ్‌ నూనె జోడించి తినాలి. ఈ సలాడ్‌ తింటే తొందరగా ఆకలి వేయదు. ఆలివ్‌ నూనెపోషకాలు తొందరగా గ్రహించేలా చేస్తుంది.  

యాపిల్‌, పీనట్‌ బటర్‌: బరువు తగ్గాలనుకునే వారు తినదగ్గ స్నాక్‌ ఇది. పీనట్‌ బటర్‌లోని మోనోసాచురేటెడ్‌, పాలీఅన్‌సాచురేటెడ్‌ కొవ్వులు ఇన్సులిన్‌ జీవక్రియను పెంచుతాయి. యాపిల్‌లోని పీచు ఆకలిని అదుపులో ఉంచుతుంది. 

గ్రీన్‌ టీ, నిమ్మరసం: క్యాలరీలు తక్కువగా, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉన్న గ్రీన్‌ టీ ఒంట్లోని అదనపు కొవ్వు, క్యాలరీలను కరిగించేస్తుంది. రోజుకు రెండు మూడు సార్లు గ్రీన్‌ టీ తాగితే జీవక్రియలు వేగంగా జరుగుతాయి. గ్రీన్‌ టీలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగితే పోషకాలు సంగ్రహణ వేగవంతం అవుతుంది.

Updated Date - 2020-12-24T05:33:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising