ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైట్‌హెడ్స్‌ వదిలించుకోండిలా

ABN, First Publish Date - 2020-11-29T15:38:45+05:30

అమ్మాయిలకు ముక్కు, గెడ్డం భాగాలలో వైట్‌ హెడ్స్‌ ఇబ్బంది పెడుతుంటాయి. వాటిని ఇంట్లోనే సులువుగా తొలగించుకోవచ్చు. పసుపు, వేపాకులు కలిపి మెత్తని పేస్టులా చేసి వైట్‌ హెడ్స్‌ ఉన్న ప్రాంతంలో రాసి ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమ్మాయిలకు ముక్కు, గెడ్డం భాగాలలో వైట్‌ హెడ్స్‌ ఇబ్బంది పెడుతుంటాయి. వాటిని ఇంట్లోనే సులువుగా తొలగించుకోవచ్చు. పసుపు, వేపాకులు కలిపి మెత్తని పేస్టులా చేసి వైట్‌ హెడ్స్‌ ఉన్న ప్రాంతంలో రాసి ఇరవై నిమిషాలు వదిలేయాలి. ఆ తరువాత నీటితో మర్ధనా చేసి కడిగేసుకోవాలి. ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. శెనగపిండి లేదా పెసరపిండితో కూడా మర్ధనా చేసుకుని కాసేపయ్యాక శుభ్రం చేసినా వైట్‌ హెడ్స్‌ మాయం అవుతాయి. గుడ్డులోని తెల్లసొన కూడా బాగా పనిచేస్తుంది. తెల్లసొనను బాగా గిలక్కొట్టి వైట్‌హెడ్స్‌ వస్తున్న చోట రాయాలి. ఎండిన తరువాత గోరువెచ్చటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తే అవి రాకుండా అడ్డుకోవచ్చు. వంటసోడా కూడా వైట్‌ హెడ్స్‌ను నిరోధించడంలో ముందుంటుంది. వంటసోడాను కాస్త తడిపి వైట్‌హెడ్స్‌ వచ్చే చోట మసాజ్‌ చేయాలి. కాసేపయ్యాక నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారంలో రెండు మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. 

Updated Date - 2020-11-29T15:38:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising