ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తొమ్మిది నెలల్లో ఎలా?

ABN, First Publish Date - 2020-03-08T16:48:36+05:30

గర్భిణి మొదటి మూడు నెలలు... రోజూ తినే ఆహారాన్నే 150 - 200 కెలోరీలు అధికంగా తీసుకోవాలి. మూడోనెల తర్వాత... ఆరోనెల నిండే వరకూ మరో నూటయాభై కెలోరీలు, ఆఖరి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(08-03-2020)

ప్రశ్న: గర్భిణులకు సంబంధించిన ఆహారం గురించి వివరిస్తారా?


- ఉదయిని, నంద్యాల


డాక్టర్ సమాధానం: గర్భిణి మొదటి మూడు నెలలు... రోజూ తినే ఆహారాన్నే 150 - 200 కెలోరీలు అధికంగా తీసుకోవాలి. మూడోనెల తర్వాత... ఆరోనెల నిండే వరకూ మరో నూటయాభై కెలోరీలు, ఆఖరి మూడు నెలల్లో ఇంకో రెండు వందల కెలోరీలు అధికంగా తీసుకోవాలి. దీనికి ఆరోగ్యకరమైన ఆహారాన్నే ఎంచుకోవాలి. విటమిన్లు, ఖనిజాలు లభించే బాదం, వాల్నట్స్‌, పిస్తా.. రోజూ తీసుకుంటే మంచిది. భోజనం ఎక్కువసార్లు కొద్దికొద్దిగా తినాలి. అతి వేడిగా,  అతి చల్లగా కాకుండా సాధారణంగా అన్న ఆహారమే మంచిది. గర్భంలోని బిడ్డ ఆరోగ్యంగా ఎదగడానికి కాల్షియం సమృద్ధిగా లభించే పాలు, పెరుగు, మజ్జిగ, పనీర్‌ అత్యవసరం. ప్రొటీన్లు ఉండే అన్ని రకాల పప్పు ధాన్యాలు, బీన్స్‌ జాతికి చెందిన రాజ్మా, అలసందలు, చిక్కుడు గింజలు తదితరాల్లో ఏదో ఒకటి ప్రతి పూటా తీసుకోవాలి. ఆకుకూరలు, తాజా పండ్లు రోజుకు రెండుసార్లయినా మంచిదే. నూనె, పంచదార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఇంటి ఆహారమే సురక్షితం.

 

డా. లహరి సూరపనేని

 న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com (పాఠకులు తమ సందేహాలను 

sunday.aj@gmail.com కు పంపవచ్చు)

Updated Date - 2020-03-08T16:48:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising