ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బరువు తగ్గడం సులువే!

ABN, First Publish Date - 2020-11-16T05:37:09+05:30

దృఢంగా, చక్కని ఆకృతిలో ఉండే శరీరం సొంతం కావాలంటే డైటింగ్‌, వర్కవుట్స్‌... ఈ రెండూ ప్రధానం అని భావిస్తాం. అయితే ఫిట్‌గా ఉండేందుకు, బరువు తగ్గేందుకు కొన్ని తేలికైన పద్ధతులు ఉన్నాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దృఢంగా, చక్కని ఆకృతిలో ఉండే శరీరం సొంతం కావాలంటే డైటింగ్‌, వర్కవుట్స్‌... ఈ రెండూ ప్రధానం అని భావిస్తాం. అయితే ఫిట్‌గా ఉండేందుకు, బరువు తగ్గేందుకు కొన్ని తేలికైన పద్ధతులు ఉన్నాయి. ఉపవాసం, కష్టతరమైన వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేకుండానే అద్భుత ఫలితాలు సాధించవచ్చు అంటున్నారు ఫిట్‌నెస్‌ నిపుణులు. వారు ఏం చెబుతున్నారంటే...

ఆహారాన్ని బాగా నమలాలి: బరువు తగ్గాలనే ఆలోచన ఉన్నవారు ఆహారాన్ని బాగా నమిలి తినాలి. ఆహారం బాగా నమలడానికి ఎక్కువ సమయం పడుతుంది. దాంతో మీరు నెమ్మదిగా తింటారు. అంతేకాదు కడుపారా తిన్న తృప్తి కలుగుతుంది. ఫలితంగా ఎక్కువగా తినరు. 

చిన్న ప్లేట్‌: ఎంత తింటున్నారు అనేది చాలా ముఖ్యం. మీరు డైటింగ్‌ చేయకున్నా, చిన్న ప్లేట్‌లో తినడం వల్ల ఎక్కువగా తిన్నాము అన్న భావన కలుగుతుంది. మీరు తినే మోతాదు తగ్గుతుంది.

నీళ్లు ఎక్కువగా: ఆకలి వేసినప్పుడు ఏది కనిపిస్తే అది తినేస్తారు. అలాకాకుండా భోజనం చేయడానికి ముందు ఎక్కువగా నీళ్లు తాగాలి. దీంతో మీరు తక్కువ తినగానే పొట్ట నిండుగా అనిపిస్తుంది. 

ఒత్తిడికి లోనవకూడదు: ఒత్తిడి, ఉద్వేగం సమయంలో ఎక్కువగా తినేస్తారు. కారణం ఒత్తిడికి లోనయినప్పుడు ఎక్కువగా విడుదలయ్యే కార్టిసాల్‌ హార్మోన్‌ ఆకలిని పెంచుతుంది అందుచేత ఎప్పుడూ పాజిటివ్‌ ఆలోచనలతో ఉండాలి. అప్పుడే ఆకలిపై నియంత్రణ సాధిస్తారు.

సరిపోనూ నిద్ర: బరువు పెరగడానికి నిద్రలేమి కూడా ఒక కారణం. చాలినంత నిద్ర లేకపోవడం వల్ల హార్మోన్ల విడుదలలో అసమతౌల్యం ఏర్పడి ఊబకాయం సమస్య వస్తుంది. కాబట్టి కంటినిండా నిద్రపోవాలి.

Updated Date - 2020-11-16T05:37:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising