ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పాదాలే కదా’ అని వదిలేయొద్దు!

ABN, First Publish Date - 2020-08-26T05:30:00+05:30

వర్షాకాలంలో పాదాలకు ఇన్‌ఫెక్షన్లు ఎక్కువగా వస్తాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే ఫంగల్‌, గోళ్ల ఇన్‌ఫెక్షన్లు, దుర్వాసనలతో పాటు రకరకాల చర్మ సమస్యలు తలెత్తుతాయి. వాటి నుంచి ఎలా రక్షించుకోవాలో చూద్దాం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వర్షాకాలంలో పాదాలకు ఇన్‌ఫెక్షన్లు ఎక్కువగా వస్తాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే ఫంగల్‌, గోళ్ల ఇన్‌ఫెక్షన్లు, దుర్వాసనలతో పాటు రకరకాల చర్మ సమస్యలు తలెత్తుతాయి. వాటి నుంచి ఎలా రక్షించుకోవాలో చూద్దాం... 


  1. వానాకాలం పాదాలు, మెడ తదితర భాగాల్లో తామరవ్యాధి వస్తుంది. దీని నుంచి రక్షించుకోవటానికి ఉతికిన, పొడిగా ఉన్న బట్టలు ధరించాలి. ఇన్‌ఫెక్షన్‌ ఉన్నచోట గోకకూడదు. యాంటీ-ఫంగల్‌ క్రీమ్‌, పౌడర్‌ రాయాలి. పాదాలు పొడిగా ఉండేలా చూసుకోవాలి.
  2. గోళ్ల కింద మట్టి పేరుకుపోవడం, సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం ఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతాయి. అందువల్ల ఎప్పటికప్పుడు గోళ్లను కత్తిరించుకోవాలి. గోళ్లు, పాదాలు తరచూ శుభ్రం చేసుకోవాలి. 
  3. ఈ సీజన్‌లో క్రీమ్‌ల కంటే లోషన్‌ రూపంలో ఉండే మాయిశ్చరైజర్లు వాడడం ఉత్తమం. కొబ్బరినూనె వాడితే దురద నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. 
  4. ఈ కాలంలో బాగా ఇబ్బంది పెట్టే మరో సమస్య టినియా కాపిటిస్‌. దీనివల్ల మాడు, కనుబొమ్మలు, రెప్పలు, గెడ్డం ప్రాంతాల్లో దురద పుడుతుంది. తరచూ షాంపూతో తలస్నానం చేయడం, చేతులు కడుక్కోవడం వంటి శుభ్రతలు పాటించడంవల్ల దీని నుంచి ఉపశమనం పొందవచ్చు.      

Updated Date - 2020-08-26T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising