ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీరసం తగ్గడానికి ఆ మాత్రలు..

ABN, First Publish Date - 2020-08-19T18:42:28+05:30

మా అమ్మకు అరవై ఏళ్ళు. నీరసంగా ఉంటోంది. ఏవైనా టానిక్‌ లేదా శక్తినిచ్చే మాత్రలు వాడాలా?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి( 19-08-2020)

ప్రశ్న: మా అమ్మకు అరవై ఏళ్ళు. నీరసంగా ఉంటోంది. ఏవైనా టానిక్‌ లేదా శక్తినిచ్చే మాత్రలు వాడాలా?


- అరుంధతి, హిందూపురం 


డాక్టర్ సమాధానం: వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో జీవ క్రియ వేగం తగ్గుతుంది. జీర్ణశక్తి, ఆహారాన్ని శోషించుకునే గుణం మందగిస్తుంది. వాసన, రుచి గ్రహించే శక్తీ సన్నగిల్లుతుంది. అందుకే ఆహారంలోనే కాక జీవన విధానంలోనూ కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే నీరసం తగ్గి శక్తి పెరుగుతుంది. పప్పులు, ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఒకేసారి ఎక్కువగా తినకుండా, మూడు గంటలకోసారి  కొద్ది మొత్తంలో ఆహారం తీసుకోవచ్చు. పీచు పదార్ధాలు ఎక్కువగా తీసుకుంటే జీర్ణాశయ ఆరోగ్యం బాగుంటుంది. రోజుకు కనీసం రెండు నుండి మూడు లీటర్ల నీరు తీసుకోవాలి. ఉదయం, సాయంత్రం నడక, యోగా వంటివి చేస్తే మంచిది. వయసు పెరిగేకొద్దీ కండరాల పటుత్వం తగ్గే అవకాశం ఉంది. దీనిని నివారించడానికి ప్రొటీన్లు ఎక్కువగా తీసుకోవాలి. గుడ్లు, మాంసం, చేపలు, పాలు, పెరుగు వంటివి తీసుకోవచ్చు. జ్ఞాపకశక్తిని, మెదడు పనితనాన్ని కాపాడే ఒమేగా-3 ఫాటీ యాసిడ్లు ఉన్న చేపలు, అవిసె గింజలు, ఆక్రోట్‌ గింజలు రోజూ తీసుకోవాలి. శరీరానికి తగినంత నిద్రను కూడా అందించాలి. వైద్యుల సలహాతో వారు సూచించిన సప్లిమెంట్లను వాడవచ్చు. సొంత వైద్యం వద్దు. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2020-08-19T18:42:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising