ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చర్మం మెరుస్తుందిలా...

ABN, First Publish Date - 2020-07-09T05:30:00+05:30

చర్మ సంరక్షణ అంత కష్టమైన పనేమి కాదు. మీ చర్మ తత్వానికి ఏవి సరిపోతాయో తెలుసుకుంటే చాలు. బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకొనే పాలు, బ్రెడ్డుతో చర్మాన్ని కాంతిమంతంగా మార్చుకోవచ్చు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చర్మ సంరక్షణ అంత కష్టమైన పనేమి కాదు. మీ చర్మ తత్వానికి ఏవి సరిపోతాయో తెలుసుకుంటే చాలు. బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకొనే పాలు, బ్రెడ్డుతో చర్మాన్ని కాంతిమంతంగా మార్చుకోవచ్చు. వీటితో తయారుచేసిన ఫేస్‌ప్యాక్‌తో తాజాదనాన్ని సొంతం చేసుకోండి..

  1. ముందుగా బ్రెడ్డును చిన్న ముక్కలుగా చేయండి. ఆ  ముక్కలను చిన్న పాత్రలో వేసి అందులో మూడు టేబుల్‌ స్పూన్ల మరగబెట్టని తాజా పాలు పోయండి. 
  2. పాలలో నానిన బ్రెడ్డు ముక్కలను స్పూన్‌ సాయంతో పేస్ట్‌లా చేయండి. 
  3. తరువాత ముఖం శుభ్రంగా కడుక్కొని, తడి లేకుండా టవల్‌తో తుడుచుకోండి. ఇప్పుడు బ్రెడ్డు, పాలతో తయారుచేసుకున్న ఫేస్‌ప్యాక్‌ను ముఖం మీద, మెడ చుట్టూ రాసుకోండి. 
  4. పదిహేను నిమిషాలయ్యాక చేతులతో ముఖం, మెడ మీద మర్దన చేయండి. తరువాత గోరు వెచ్చని నీళ్లతో ముఖం కడుక్కోండి. 
  5. వారానికి ఒకసారి ఈ ఫేస్‌ప్యాక్‌ వేసుకుంటే మృతకణాలు తొలగి చర్మం కాంతిమంతంగా మారుతుంది. ముఖం, మెడ భాగంలో రక్తప్రసరణ పెరిగి తాజాగా కనిపిస్తాయి. 
  6. మిల్క్‌, బ్రెడ్‌ ఫేస్‌ప్యాక్‌లో కొద్దిగా తేనె, పసుపు కలిపి ముఖానికి పట్టించవచ్చు.

Updated Date - 2020-07-09T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising