ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీజనల్‌ ఫ్రూట్స్‌తో ఆరోగ్యం!

ABN, First Publish Date - 2020-11-05T05:30:00+05:30

చలికాలంలో జలుబు, దగ్గు, జ్వరం వంటి చిన్నచిన్న అనారోగ్యాలు ఎక్కువగా వేధిస్తుంటాయి. రోగనిరోధకశక్తిని పెంచుకోవడం ద్వారా ఈ సమస్యలు దరిచేరకుండా చూసుకోవచ్చు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చలికాలంలో జలుబు, దగ్గు, జ్వరం వంటి చిన్నచిన్న అనారోగ్యాలు ఎక్కువగా వేధిస్తుంటాయి. రోగనిరోధకశక్తిని పెంచుకోవడం ద్వారా ఈ సమస్యలు దరిచేరకుండా చూసుకోవచ్చు. అందుకోసం గ్రీన్‌ టీ, జింజర్‌ టీ వంటి ఇమ్యూనిటీ డ్రింక్స్‌తో పాటు ఈ సీజన్‌లో దొరికే జామ, నారింజ, బత్తాయి పండ్లు ఎక్కువగా తినాలి. ఈ పండ్లలోని విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యాన్ని పెంచుతాయి. 




జామ: నోరూరించే జామ పండ్లలో విటమిన్‌ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఒంట్లోని ఫ్రీరాడికల్స్‌ను తొలగించి, కణాలు దెబ్బతినకుండా చూస్తాయి. ఈ పండులోని పీచుపదార్థం రక్తంలో చక్కెర స్థాయుల్ని అదుపులో ఉంచుతుంది. గుండెకు మేలు చేస్తుంది. 

నారింజ: ఈ నిమ్మజాతి పండులో విటమిన్‌ సి, కాల్షియం ఎక్కువ  మోతాదులో ఉంటాయి. ఇవి సీజనల్‌ ఇన్‌ఫెక్షన్లను దూరం చేస్తాయి. రోజూ ఒక నారింజ పండు తింటే అనారోగ్యం దరిచేరకుండా ఉంటుంది.

యాపిల్‌: ఈ పండు ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి, రోగనిరోధకశక్తిని మెరుగుపరుస్తుంది. దీనిలోని పెక్టిన్‌ ఫైబర్‌ , విటమిన్‌ సి, కె ఇమ్యూనిటీని పెంచుతాయి. 

బత్తాయి: విటమిన్‌ సి ఎక్కువగా ఉండే పండు తింటే రోగనిరోధకశక్తి పెరుగుతుంది. జీర్ణశక్తి మెరుగవుతుంది. బత్తాయి శ్వాసపరమైన సమస్యలను తగ్గిస్తుంది. బరువు తగ్గడంలో సాయపడుతుంది.

Updated Date - 2020-11-05T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising