ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సలాడ్‌ రుచి కోసం!

ABN, First Publish Date - 2020-11-18T05:30:00+05:30

తేలికగా ఉండి పోషకాలతో నిండిన సలాడ్స్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే సలాడ్స్‌ ఒక్కోసారి రుచించవు. దాంతో వాటిని తినాలటే మనసొప్పదు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తేలికగా ఉండి పోషకాలతో నిండిన సలాడ్స్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే సలాడ్స్‌ ఒక్కోసారి రుచించవు. దాంతో వాటిని తినాలటే మనసొప్పదు. అప్పుడు సలాడ్‌కు కొన్ని పదార్థాలు జోడిస్తే పోషకవిలువలు తగ్గకుండా వాటిని రుచికరంగా మార్చేయవచ్చు. అందుకు ఏం చేయాలంటే...


  1. సలాడ్‌  అలంకరణ, రుచి కోసం ఆలివ్‌ ఆయిల్‌ ఎక్కువగా వాడతారు. పావు కప్పు ఆలివ్‌ ఆయిల్‌, రెండు టేబుల్‌ స్పూన్ల నువ్వుల నూనె, దంచిన వెల్లుల్లి రెబ్బలు మూడు, టేబుల్‌ స్పూన్‌ చొప్పున సోయా సాస్‌, చిల్లీ సాస్‌, తేనె, తరిగిన తాజా అల్లం వేయాలి. వీటిని వేసి సలాడ్‌ను బాగా కలపాలి. ఇప్పుడు సలాడ్‌ను లొట్టలేస్తూ తింటారు. 
  2. పావు కప్పు చొప్పున మస్టర్డ్‌ సాస్‌ (మార్కెట్‌లో కొన్నది), తేనె, రెండు టేబుల్‌ స్పూన్ల యాపిల్‌ సెడార్‌ వెనిగర్‌, రెండు లేదా మూడు టేబుల్‌ స్పూన్ల ఆలివ్‌ నూనె, చిటికెడు ఉప్పు, మిరియాల పొడి తీసుకోవాలి. వీటన్నింటిని మిక్స్‌ చేసి క్రీమీ పేస్ట్‌లా వచ్చేంత వరకు కలపాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను సలాడ్‌ మీద చల్లుకొని తినాలి. 
  3. కొద్దిగా జున్ను తీసుకొని సలాడ్‌లో వేసి, బాగా కలపాలి. ఆరోగ్యకరమైన జున్ను సలాడ్‌కు చక్కని రుచి తెస్తుంది. ఎంచక్కా సలాడ్‌ను లాగించేస్తారు. 

Updated Date - 2020-11-18T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising