ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైట్‌ టు ప్రొటీన్‌

ABN, First Publish Date - 2020-02-29T06:49:58+05:30

ఫిబ్రవరి 27... ఈ రోజును అంతర్జాతీయ ప్రొటీన్‌ దినోత్సవంగా గుర్తించారు. ఈ ఏడాది నుంచి భారత ప్రభుత్వం కూడా ‘రైట్‌ టు ప్రొటీన్‌’ క్యాంపెయిన్‌ పేరుతో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫిబ్రవరి 27... ఈ రోజును అంతర్జాతీయ ప్రొటీన్‌ దినోత్సవంగా గుర్తించారు. ఈ ఏడాది నుంచి భారత ప్రభుత్వం కూడా  ‘రైట్‌ టు ప్రొటీన్‌’ క్యాంపెయిన్‌ పేరుతో ఈ వేడుకలు జరుపుతోంది. దీని ముఖ్యోద్దేశం ఏమిటంటే... ప్రొటీన్‌పై ప్రజలకు అవగాహన కల్పించడం.


ప్రొటీన్‌ అంటే: ప్రొటీన్‌ అంటే మాంసకృత్తులు. ఇవి కొవ్వు పదార్థాల్లో తప్ప అన్ని ఆహారపదార్థాల్లో కొన్నింట్లో ఎక్కువ, కొన్నింట్లో తక్కువగా ఉంటాయి. 

ప్రొటీన్‌తో లాభాలు: ప్రొటీన్లు కణాల పుట్టుకకు అవసరం. రోగనిరోధక శక్తి కణాలు మెరుగుపడాలంటే ప్రొటీన్లు అవసరం. రక్తంలోని హిమోగ్లోబిన్‌లో ప్రొటీన్‌ ఉంటుంది. ఎంజైములు, హార్మోన్ల తయారీకి ప్రొటీన్లు అవసరం. గర్భవతులు, పాలిచ్చే తల్లులు, చిన్న పిల్లలు, టీనేజర్లకు ప్రొటీన్లు చాలా కావాలి. 99 శాతం మందికి ఏదో ఒక సమయంలో కొంత ప్రొటీన్‌ లోపం జరుగుతుంది. ఇది కేవలం ఆహారలోపం వల్ల ఏర్పడుతుంది. ఆహారంలో తిరిగి ప్రొటీన్‌ చేర్చగానే సాధారణంగా అయిపోతాం. ఆపరేషన్‌ తర్వాత, ఎదుగుతున్న సమయంలో ప్రొటీన్‌ అవసరం చాలా ఉంటుంది.

ప్రొటీన్‌ ఇచ్చే ఆహారపదార్థాలు: కొవ్వు పదార్థాలు మినహా అన్ని ఆహార పదార్థాల్లో ప్రొటీన్లు ఉంటాయి. ధాన్యపుగింజల్లో 10శాతం, మాంసాహారం, పప్పుదినుసులు, నట్స్‌, ఆయిల్‌సీడ్స్‌లో 20 నుంచి 30 శాతం, సోయాలో 40 శాతం, తెలగపిండిలో 50 నుంచి 60 శాతం, గుడ్డులో 99 శాతం ప్రొటీన్‌ ఉంటుంది. పాల పదార్థాల్లో కూడా ప్రొటీన్‌ లభిస్తుంది. పాలలో 3 శాతం, పనీర్‌లో 80 శాతం, పండ్లు, కూరగాయల్లో 2 శాతం వరకు ప్రొటీన్‌ ఉంటుంది. 

ప్రొటీన్‌ సప్లిమెంట్స్‌: మార్కెట్లో అనేకరకాలైన ప్రొటీన్‌ సప్లిమెంట్లు లభిస్తున్నాయి. వే ప్రొటీన్‌, సింగిల్‌ సెల్‌ ప్రొటీన్‌, గ్రీన్‌ లీఫ్‌ కాన్‌సంట్రేట్‌ (క్యాప్సూల్స్‌గా)లు ఉన్నాయి. వీటిని వాడేప్పుడు నిపుణుల సలహాలు తీసుకోవాలి.

ప్రొటీన్‌ అవసరం ఎలా కనుక్కోవాలి: శరీరాకృతి, వయసు, బరువు, ఆరోగ్య సమస్యలను బట్టి ప్రొటీన్‌ అవసరాన్ని నిర్ణయిస్తారు. పోషకాహార నిపుణలు సరైన ప్రొటీన్‌ ప్లాన్‌ చేసి, ఆహారంలో ఎలా చేర్చాలో చెబుతారు. 

ప్రొటీన్‌ డైట్‌ ప్లాన్‌: ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఒక గుడ్డు ఉండాలి. మధ్యాహ్న భోజనంలో అన్నంతో పాటు గుప్పెడు పప్పుదినుసులు కలిపి వండటం, చపాతీ పిండిలో పప్పు పిండి లేదా సోయా పిండి కొద్దిగా కలపడం చేయాలి. సాయంత్రం స్నాక్స్‌ టైమ్‌లో వేరు సెనగలు తినాలి. లంచ్‌, డిన్నర్‌లలో పప్పు లేదా నాన్‌వెజ్‌గానీ... గుడ్డు లేదా పనీర్‌గానీ తప్పకుండా ఉండాలి. సో... ప్రొటీన్‌ లోపం లేకుండా చూసుకోండి.


- డాక్టర్‌ బి.జానకి, న్యూట్రిషనిస్ట్‌

drjanakibadugu@gmail.com

Updated Date - 2020-02-29T06:49:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising