ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్ట్రెచింగ్‌తో కండరాలకు సాంత్వన!

ABN, First Publish Date - 2020-09-10T05:30:00+05:30

వ్యాయామంతో లాభం ఉండాలంటే సరైన పద్ధతిలో చేయాలి. అలానే ఫిట్‌నెస్‌ లక్ష్యాలను సాధించేందుకు వర్కవుట్‌కు ముందు వామప్‌ చేయడం, వర్కవుట్‌ తరువాత స్ట్రెచింగ్‌ చేయడం ముఖ్యమే....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వ్యాయామంతో లాభం ఉండాలంటే సరైన పద్ధతిలో చేయాలి. అలానే ఫిట్‌నెస్‌ లక్ష్యాలను సాధించేందుకు వర్కవుట్‌కు ముందు వామప్‌ చేయడం, వర్కవుట్‌ తరువాత స్ట్రెచింగ్‌ చేయడం ముఖ్యమే. వర్కవుట్‌ తరువాత స్ర్టెచింగ్‌ చేయడం వల్ల కండరాలు సాంత్వన పొందుతాయి అంటున్నారు సెలబ్రిటీ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ యాస్మీన్‌ కరాచివాలా. ఆమె సూచిస్తున్న నాలుగు రకాల స్ర్టెచింగ్‌ 


వర్కవుట్స్‌ ఇవి...

  1. క్వాడ్రిసెప్స్‌ స్ట్రెచ్‌: ఒక పక్కకు తిరిగి పడుకోవాలి. శరీరం బరువు పొట్టపై పడేలా చూసుకోవాలి. ఇప్పుడు ఎడమ మోకాలిని సాధ్యమైనంత వెనక్కి వంచాలి. ఎడమ చేతితో మెకాలిని పట్టుకొని పిరుదులకు దగ్గరగా తీసుకురావాలి. ఈ పొజిషన్‌లో 30 సెకన్లు ఉండాలి. తరువాత కుడి మోకాలు, కుడిచేతితో స్ట్రెచింగ్‌ చేయాలి. దీంతో మోకాలి సమస్యలు ఉన్నవారికి, శరీరాన్ని బ్యాలెన్స్‌ చేసేందుకు కష్టపడే వారికి ఈ స్ట్రెచింగ్‌ ఎంతో ఉపయోగపడుతుంది. 
  2. హిప్‌ ఫ్లెక్సర్‌ స్ట్రెచ్‌: ఎడమ కాలిని నేలపై ముందుకు జరిపి కూర్చోవాలి. కుడి కాలు తొంభై డిగ్రీలలో ఉండాలి. ఇప్పుడు చేతులను కుడి మోకాలి మీద ఉంచి, వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోవాలి. తరువాత ఎడమ మోకాలిని నేలకు అదిమిపడుతూ, కుడి చేతిని పైకి లేపి వీలైనంత వెనక్కి తేవాలి. 30 సెకన్లు ఈ పొజిషన్‌లో ఉండాలి. రెండు కాళ్లతో ఈ స్ట్రెచింగ్‌ చేయాలి. ఇలాచేస్తే వెన్నునొప్పి, తొడభాగంలో నొప్పి తగ్గిపోతుంది. 
  3. గ్లూట్‌ స్ట్రెచ్‌: ముందుగా నేలపై వెల్లకిలా పడుకోవాలి. కాళ్లను మోకాళ్ల వరకు వంచి చేతులను కుడి తొడి మీద పెట్టాలి. ఇప్పుడు కుడి తొడను ఛాతికి దగ్గరగా తేవాలి. ఎడమ తొడను నేలపై అదిమి పట్టి ఉంచాలి. ఈ పొజిషన్‌లో 20 నుంచి 30 సెకన్లు ఉండాలి. ఈ స్ట్రెచింగ్‌తో వెన్నునొప్పి తగ్గుతుంది. తొడ దగ్గరి కీళ్లు, కండరాలకు సాంత్వన లభిస్తుంది.
  4. హామ్‌స్ట్రింగ్‌ స్ట్రెచ్‌: నేలపై వెల్లకిలా పడుకొన్న తరువాత కుడి మోకాలి చేతులతో పట్టుకొని ఛాతికి దగ్గరగా తీసుకురావాలి. మోకాలిని మరింత వంచేందుకు టవల్‌ లేదా తాడు సాయం తీసుకోవచ్చు. ఈ భంగిమలో 30 సెకన్లు ఉండాలి. తరువాత ఎడమ మోకాలితో ఇలానే స్ట్రెచింగ్‌ చేయాలి. దీంతో తొడ కండరాలు స్ట్రెచ్‌ అవుతాయి.

Updated Date - 2020-09-10T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising