ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గర్భిణులు ఓఆర్‌ఎస్‌ తాగొచ్చు!

ABN, First Publish Date - 2020-09-01T15:59:27+05:30

ఉదయం పూట వికారం, వాంతి వచ్చినట్టు అనిపించడం, డీహైడ్రేషన్‌ వంటి సమస్యలు గర్భిణుల్లో కనిపిస్తుంటాయి. అలాంటప్పుడు వారికి ఓఆర్‌ఎస్‌ ద్రావణం తాగిపించడం ద్వారా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి (01-0-2020): ఉదయం పూట వికారం, వాంతి వచ్చినట్టు అనిపించడం, డీహైడ్రేషన్‌ వంటి సమస్యలు గర్భిణుల్లో కనిపిస్తుంటాయి. అలాంటప్పుడు వారికి ఓఆర్‌ఎస్‌ ద్రావణం తాగిపించడం ద్వారా   డీహైడ్రేషన్‌ను కొంతవరకూ తగ్గించవచ్చు అంటున్నారు గైనకాలజిస్ట్‌ సురభీ సిద్ధార్థ. 


‘‘నోరు తడారిపోవడం, తలనొప్పి, దాహం ఎక్కువవడం, మూత్రం ఎక్కువగా రావడం వంటివి డీహైడ్రేషన్‌కు లోనయిప్పుడు కనిపించే లక్షణాలు.  అలా జరగకుండా ఉండాలంటే నీళ్లు ఎక్కువగా తాగాలి. ఓఆర్‌ఎస్‌ ద్రావణంలో   పొటాషియం, సోడియం, చక్కెర, ఇతర ముఖ్యమైన ఎలకో్ట్రలైట్స్‌ ఉంటాయి. ఓఆర్‌ఎస్‌ తాగితే వాంతులు తగ్గిపోతాయి. ఈ ద్రావణం రుచిగా ఉండడంతో పాటు కోల్పోయిన లవణాలను తిరిగి అందిస్తుంది. దీంతో ఏ చెడు ప్రభావం ఉండదు’’ అంటున్నారు సురభి. అయితే సమస్య తీవ్రమయినప్పుడు తప్పకుండా వైద్యనిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నారామె.

Updated Date - 2020-09-01T15:59:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising