ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉల్లిరసం... కురులకు బలం

ABN, First Publish Date - 2020-06-10T05:34:38+05:30

జుట్టు రాలిపోవడం తగ్గేందుకు, కురుల పోషణకు ఈసారి ఉల్లిరసం ప్రయత్నించండి. అంతేకాదు ఉల్లిపాయతో ఇంటి వద్దనే చుండ్రు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అంటున్నారు చర్మనిపుణురాలు డాక్టర్‌ పల్లవీ సూలే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జుట్టు రాలిపోవడం తగ్గేందుకు, కురుల పోషణకు ఈసారి ఉల్లిరసం ప్రయత్నించండి. అంతేకాదు ఉల్లిపాయతో ఇంటి వద్దనే చుండ్రు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అంటున్నారు చర్మనిపుణురాలు డాక్టర్‌ పల్లవీ సూలే. 


ఉల్లిరసంలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్‌ గుణాలు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. కురులు, మాడుకు ఉల్లిరసం రుద్దుకుంటే రక్తప్రసరణ పెరిగి కుదుళ్లు బలంగా మారతాయి. అలానే జుట్టు నెరవడం ఆలస్యం అవుతుంది. 




ఉల్లిరసం తయారీ: పెద్ద ఉల్లిపాయను ముక్కలుగా కోసి మిక్సీ పట్టాలి. ఉల్లిరసాన్ని పొడిగా ఉన్న గాజు సీసాలో మస్లిన్‌ వస్త్రంతో వడబోసి ఫ్రిజ్‌లో పెట్టాలి. 


హెయిర్‌ మాస్క్‌: రెండు టీ స్పూన్ల ఉల్లిరసంలో టీస్పూన్‌ తేనె కలపాలి. తలస్నానం చేయడానికి 15-20 నిమిషాల ముందు ఈ మిశ్రమాన్ని తలకు మాస్క్‌లా వేసుకోవాలి. ఇలాచేయడం వల్ల కుదుళ్లు బలీయమవుతాయి. చుండ్రు సమస్య తగ్గుతుంది. జుట్టు కూడా తొందరగా పెరుగుతుంది.


ఉల్లిరసం, ఆముదం నూనె: ఒక గిన్నెలో సమపాళ్లలో ఉల్లిరసం, ఆముదం నూనె కలపాలి. కురులకు పట్టంచి గంట తరువాత తలస్నానం చేయాలి. ఈ రెండిటిలోని యాంటీ ఇన్‌ఫ్లమేషన్‌, యాంటీ మైక్రోబియల్‌ గుణాలు ఇన్‌ఫెక్షన్లను మటుమాయం చేస్తాయి. 


గుర్తుంచుకోండి: 

  1. ఉల్లిపాయ ఎలర్జీ ఉన్నవారు ఉల్లిరసాన్ని వాడకపోవడమే మంచిది. 
  2. ఉల్లిరసం దురద పుట్టిస్తుంది. అలా జరగకుండా అందులో అలోవెరా, కొబ్బరి నూనె లేదా తేనె కలపాలి. 
  3. కొన్ని చుక్కల లావెండర్‌ లేదా టీ ట్రీ ఆయిల్‌ కలిపితే ఉల్లిరసం ఘాటు వాసన తగ్గుతుంది.

Updated Date - 2020-06-10T05:34:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising