ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉల్లిరసంతో దృఢమైన కురులు...

ABN, First Publish Date - 2020-09-21T05:30:00+05:30

కూరల్లో తప్పక ఉండే ఉల్లిపాయతో కురులను అందంగా, ఆరోగ్యంగా మలచుకోవచ్చు. ఉల్లిపాయ రసాన్ని వారానికి ఒకసారి జుట్టుకు రాసుకుంటే దృఢమైన, తళుకులీనే కేశాలు సొంతమవుతాయి. అదెలాగంటే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కూరల్లో తప్పక ఉండే ఉల్లిపాయతో కురులను అందంగా, ఆరోగ్యంగా మలచుకోవచ్చు. ఉల్లిపాయ రసాన్ని వారానికి ఒకసారి జుట్టుకు రాసుకుంటే దృఢమైన, తళుకులీనే కేశాలు సొంతమవుతాయి. అదెలాగంటే...

ముందుగా రెండు ఉల్లిపాయలను చిన్నగా కట్‌ చేయాలి. తరువాత వాటిని మిక్సీలో పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపేస్ట్‌లోని రసాన్ని ఒక పాత్రలో వడబోయాలి. ఈ రసాన్ని మాడుకు బ్రష్‌ సాయంతో చక్కగా రాసుకోవాలి. కొద్దిసేపు మసాజ్‌ చేయాలి. గంట తరువాత నీళ్లలో శుభ్రం చేసుకొని, కండిషనర్‌ అప్లై చేయాలి. వారానికి ఒకసారి ఇలాచేస్తే జుట్టు రాలిపోవడం తగ్గిపోతుంది. అంతేకాదు వెంట్రుకలు బాగా పెరుగుతాయి. 

ఉల్లిపాయలో సల్ఫర్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది వెంట్రుకల గట్టిదనానికి అవసరమైన కెరాటిన్‌ను పెంపొందిస్తుంది. ఉల్లిరసం రాసుకోవడం ద్వారా కుదుళ్లకు రక్తసరఫరా పెరుగుతుంది. దాంతో వెంట్రుకలు ఆరోగ్యంగా పెరుగుతాయి.

Updated Date - 2020-09-21T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising