ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

70 లక్షల మందికి అవాంఛిత గర్భం!

ABN, First Publish Date - 2020-04-30T16:04:25+05:30

కరోనా వైరస్‌ మహిళలపైనా తీవ్ర ప్రభావం చూపుతోందని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. రానున్న రోజుల్లో విశ్వవ్యాప్తంగా దాదాపు 70 లక్షల మంది మహిళలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘కరోనా’తో మహిళలపై తీవ్ర ప్రభావం

ఐక్యరాజ్యసమితి హెచ్చరిక

ఐక్యరాజ్యసమితి, ఏప్రిల్‌ 29: కరోనా వైరస్‌ మహిళలపైనా తీవ్ర ప్రభావం చూపుతోందని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. రానున్న రోజుల్లో విశ్వవ్యాప్తంగా దాదాపు 70 లక్షల మంది మహిళలు అవాంఛిత గర్భధారణ పొందే అవకాశముందని ఐక్యరాజ్యసమితి పాపులేషన్‌ ఫండ్‌ (యూఎన్‌ఎ్‌ఫపీఏ) చేసిన పరిశోధనలో తేలింది. కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్‌తో పాటు మరిన్ని చర్యలు చేపట్టడంతో ఆరోగ్య సదుపాయాలు, కుటుంబ నియంత్రణ లాంటి పద్ధతులకు మహిళలు దూరమవడంతో ఈ పరిస్థితి తలెత్తుతోందని ఆ పరిశోధన చెబుతోంది. మరో ఆరునెలలు ఇదే పరిస్థితి కొనసాగితే ఈ మహిళల సంఖ్య 4.7 కోట్లకు చేరుతుందని యూఎన్‌ఎ్‌ఫపీఏ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నటాలియా కానెమ్‌ హెచ్చరించారు. అలాగే గృహహింస, బాలికలపై వేధింపులు వంటి తీవ్రమైన పరిణామాలను కూడా మున్ముందు చవిచూడాల్సి ఉంటుందని ఆమె వెల్లడించారు. ఇలాంటి విపత్కర సమయంలో మహిళల ఆరోగ్యం, వారికి కావాల్సిన సదుపాయాలు, వారి హక్కులకు భంగం వాటిల్లకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఆయా దేశాలు ప్రధానంగా దృష్టి సారించాల్సిన అవకాశముందని ఐక్యరాజ్యసమితి గుర్తుచేస్తోంది. 

Updated Date - 2020-04-30T16:04:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising