ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వంటిల్లే ఔషధశాల...

ABN, First Publish Date - 2020-11-26T05:44:07+05:30

ఇంటి నుంచి బయట అడుగుపెడితే చాలు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతాం. కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల పనితీరు నెమ్మదిస్తుంది. గుండె సంబంధ జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంది. కాలుష్యం కరోనా ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ సమస్యల నుంచి వంటింట్లో లభించే ఔషధ దినుసులతో ఎలా బయటపడొచ్చో చూద్దాం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటి నుంచి బయట అడుగుపెడితే చాలు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతాం. కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల పనితీరు నెమ్మదిస్తుంది. గుండె సంబంధ జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంది. కాలుష్యం కరోనా ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ సమస్యల నుంచి వంటింట్లో లభించే ఔషధ దినుసులతో ఎలా బయటపడొచ్చో చూద్దాం.. 


అల్లం: జలుబు, దగ్గు వంటి చిన్న చిన్న అనారోగ్యాల నుంచి అల్లం బయటపడేస్తుంది. దీనిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శ్వాసనాళంలోని మలినాలను తొలగిస్తాయి. అంతేకాదు అల్లంలోని విటమిన్లు, పొటాషియం, బీటాకెరోటిన్‌, జింక్‌ ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతాయి. అల్లంను టీ, కూరలో నిత్యం తీసుకోవాలి. 


పసుపు: శ్వాసపరమైన సమస్యల వల్ల వచ్చే ఇన్‌ఫ్లమేషన్‌ను పసుపు తగ్గిస్తుంది. దీనిలోని పదార్థాలు ఊపిరితిత్తులను శుభ్రం చేస్తాయి. అంతేకాదు రోగనిరోధకశక్తిని పెంచి, ఒంట్లోని మలినాలను తొలగిస్తాయి. పాలలో, కూర, సలాడ్‌, స్మూతీలలో పసుపు వేసుకుంటే ఆరోగ్యానికి అన్నివిధాలా మంచిది. 


వెల్లుల్లి: ఇది యాంటీబయాటిక్‌గా పనిచేసి, శ్వాసవ్యవస్థలో ఏర్పడే ఇన్‌ఫెక్షన్లను దూరం చేస్తుంది. శ్వాసతీసుకోవడంలో ఇబ్బందిని పోగొడుతుంది. ఊపిరితిత్తుల కేన్సర్‌ ముప్పును అడ్డుకుంటుంది. ఆస్తమాతో బాధ పడేవారికి వెల్లుల్లి ఔషధంగా పనిచేస్తుంది.


తేనె: దీనిలో యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు శ్వాసపరమైన సమస్యలను దూరం చేస్తాయి. శ్వాస తీసుకోవడంలో ఏ ఇబ్బంది లేకుండా చేసి, ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతుంది. వేడినీళ్లలో ఒక స్పూన్‌ తేనె కలిపి తాగితే ఊపిరితిత్తులు శుభ్రపడతాయి. జలుబు, దగ్గుకు తేనె మంచి ఔషధం. 

Updated Date - 2020-11-26T05:44:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising