ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇమ్యూనిటీ కోసం..!

ABN, First Publish Date - 2020-09-30T05:58:45+05:30

వర్షాకాలంలో తరచుగా వేధించే జలుబు, దగ్గుతో పాటు ఇతర ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా ఉండేందుకు ఔషధ గుణాలున్న డ్రింక్‌ తీసుకోవాలి. ఇంట్లో లభించే పదార్థాలతోనే అలాంటి డ్రింక్‌ తయారుచేసుకోవచ్చు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వర్షాకాలంలో తరచుగా వేధించే జలుబు, దగ్గుతో పాటు ఇతర ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా ఉండేందుకు ఔషధ గుణాలున్న డ్రింక్‌ తీసుకోవాలి. ఇంట్లో లభించే పదార్థాలతోనే అలాంటి డ్రింక్‌ తయారుచేసుకోవచ్చు.

 

కావలసినవి

కొద్దిగా అల్లం, నల్ల యాలకులు-1, పచ్చి యాలకులు-2, నల్ల మిరియాలు- 8, దాల్చిన చెక్క- ఒకటి, లవంగాలు అయిదు, తులసి ఆకులు- ఎనిమిది, బిర్యానీ ఆకు ఒకటి, తేనె టేబుల్‌ స్పూన్‌, నల్ల ఉప్పు, నిమ్మరసం రుచికి సరిపడా. 


తయారీ విధానం

  1. చిన్న రోలు తీసుకొని అందులో అల్లం, యాలకులు, మిరియాలు, లవంగాలు వేసి మెత్తని పొడి తయారుచేసుకోవాలి. తరువాత తులసి ఆకులు వేసి రుబ్బాలి. 
  2. ఇప్పుడు ఒక పాన్‌లో రెండు కప్పుల నీళ్లు పోసి, స్టవ్‌ మీద పెట్టాలి. సుగంధ ద్రవ్యాల పొడి, బిర్యానీ ఆకు  వేసి కాసేపు మరిగించాలి. తరువాత మంట తగ్గించి పది నిమిషాలు అలానే ఉంచాలి. ఇప్పుడు డ్రింక్‌ను కప్పుల్లో వడబోసి, ఉప్పు, నిమ్మరసం, తేనె రుచికి తగినంత కలుపుకొంటే ఇమ్యూనిటీ డ్రింక్‌ రెడీ.

Updated Date - 2020-09-30T05:58:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising