ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇలా చేస్తే... కరోనా పరార్‌!

ABN, First Publish Date - 2020-04-06T06:37:57+05:30

కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి సామాజిక దూరం పాటిస్తూ, చేతులు శుభ్రం చేసుకుంటే మాత్రమే సరిపోదు. రోగనిరోధక శక్తిని పెంపొందించే ఆహారాన్ని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి సామాజిక దూరం పాటిస్తూ, చేతులు శుభ్రం చేసుకుంటే మాత్రమే సరిపోదు. రోగనిరోధక శక్తిని పెంపొందించే ఆహారాన్ని తీసుకోవాలి. అలాంటి ఆహారానికి సంబంధించిన వివరాలు ఇవి....


రోజూ ఇలా చేయండి!

  1. నీళ్లలో పుదీనా, వాము వేసి ఆవిరి పట్టాలి. 
  2. లవంగాల పొడిని తేనె లేదా పంచదారతో కలిసి తీసుకున్నా ఫలితం ఉంటుంది.



పొడి దగ్గు, గొంతు నొప్పి ఉంటే...

  1. నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె లేదా నెయ్యి మూడు నాలుగు చుక్కలను ఉదయం, సాయంత్రం ముక్కులో వేసుకోవాలి.
  2. ఒక టేబుల్‌స్పూన్‌ నువ్వు ల నూనె లేదా కొబ్బరి నూనెను నోట్లో వేసుకొని ఆయిల్‌ పుల్లింగ్‌ చేయాలి. రెండు, మూడు నిమిషాలు చేసిన తరువాత గోరు వెచ్చని నీటితో పుక్కిలించాలి. రోజులో ఒకటి రెండుసార్లు ఇలా చేయాలి.


సాధారణ నియమాలు

  1. రోజంతా గోరు వెచ్చని నీళ్లు తాగండి.
  2. ప్రతిరోజూ యోగాసనాలు వేయండి. ప్రాణాయామం చేయండి. కనీసం అరగంట పాటు ధ్యానం చేయండి.
  3. పసుపు, జీలకర్ర, కొత్తిమీరను రోజూ వంటల్లో ఉపయోగించండి.


రోగనిరోధక శక్తి పెరగడం కోసం...

  1. ప్రతిరోజు ఉదయం ఒక టేబుల్‌స్పూన్‌ చ్యవన్‌ప్రాశ్‌ తీసుకోండి. 
  2. హెర్బల్‌ టీ తాగండి. తులసి, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, శొంఠి వేసుకొని తయారుచేసిన హెర్బల్‌ టీ మరింత ఉపయుక్తం. రుచిని కోరుకునే వారు బెల్లం, నిమ్మరసం జత చేసుకోవచ్చు. రోజులో రెండుసార్లు ఇది తీసుకోవాలి.
  3. పాలలో అర టీస్పూన్‌ పసుపు వేసుకొని రోజులో రెండుసార్లు తాగండిపాలలో అర టీస్పూన్‌ పసుపు వేసుకొని రోజులో రెండుసార్లు తాగండి.

Updated Date - 2020-04-06T06:37:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising