ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ సూపర్‌ఫుడ్స్‌ తింటున్నారా!

ABN, First Publish Date - 2020-11-19T05:30:00+05:30

చలికాలంలో రోగనిరోధకశక్తి పెంచుకోవడంతో పాటు చర్మం ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు పోషకాహార నిపుణుడు రుజుతా దివేకర్‌...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చలికాలంలో రోగనిరోధకశక్తి పెంచుకోవడంతో పాటు చర్మం ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు పోషకాహార నిపుణుడు రుజుతా దివేకర్‌. ఆయన చెబుతున్న ఆహార జాగ్రత్తలివి...


సజ్జ: బి విటమిన్లు అధికంగా ఉంటాయి. కండరాల పరిమాణం పెరుగుతుంది. వెంట్రుకలు పెరిగేందుకు సాయపడుతుంది. 

ఎలా తినాలి: చపాతీ, లడ్డూ, కిచిడీ, అట్టు... ఇలా ఏ విధంగా తిన్నా ఫలితం ఉంటుంది.

వేరు జాతి కూరగాయలు: ఇవి ప్రి బయాటిక్‌. బరువు తగ్గడంలో, జీర్ణక్రియ సవ్యంగా జరగడంలో తోడ్పడతాయి. అలానే పోషకాల శోషణను పెంచుతాయి.

ఎలా తినాలి: టిక్కీ, కూర, ఫ్రై చేసుకొని తినొచ్చు. 

నువ్వులు: వీటిలో అత్యవసర ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్‌ ఇ ఎక్కువ. కురులు, చర్మం, ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఎలా తినాలి: చిక్కీ, లడ్డూ, చట్నీగా నువ్వులను తీసుకోవాలి.

వేరు సెనగలు: విటమిన్‌ బి, ఆమినో ఆమ్లాలు, పాలీ ఫినాల్స్‌ ఉంటాయి. ఇవి గుండెను భద్రంగా ఉంచుతాయి. 

ఎలా తినాలి: ఉడికించి లేదా వేగించి తినొచ్చు. చట్నీగా, సలాడ్‌ లేదా కూరల్లో వేసుకొని తిన్నా ఓకే.

నెయ్యి: విటమిన్‌ డి శోషణలో ఉపయోగపడుతుంది. ఆహారానికి రుచిని తెస్తుంది.

ఎలా తినాలి: పప్పు, అన్నం, చపాతీతో తీసుకోవచ్చు.

Updated Date - 2020-11-19T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising