ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వానల్లో శిరోజాల మాస్క్‌లివి!

ABN, First Publish Date - 2020-08-12T05:30:00+05:30

వర్షాకాలంలో జుట్టుతో ఎన్నో సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా దురద, చుండ్రులతో బాధపడుతుంటాం. అయితే జుట్టుకు సంబంధించిన కొన్ని ఆరోగ్యకరమైన మాస్కులు ఉన్నాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వర్షాకాలంలో జుట్టుతో ఎన్నో సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా దురద, చుండ్రులతో బాధపడుతుంటాం. అయితే జుట్టుకు సంబంధించిన కొన్ని ఆరోగ్యకరమైన మాస్కులు ఉన్నాయి. వాటితో శిరోజాలు సురక్షితంగా, అందంగా ఉంటాయి. 


అవకాడో- ఆలివ్‌ ఆయిల్‌ మాస్క్‌ 

కావలసినవి: అవకాడో -అరముక్క, గుడ్డు-ఒకటి, ఆలివ్‌ ఆయిల్‌- ఒక టేబుల్‌స్పూన్‌, తేనె- ఒక టేబుల్‌స్పూన్‌.

వీటన్నింటినీ మిక్స్‌ చేసి మిశ్రమాన్ని తడిగా ఉన్న తలకు వేళ్ల అంచులతో పైనుంచి బాగా రాయాలి. తర్వాత జుట్టు ముడి వేసుకోవాలి. ఇలా చేస్తే మెల్లగా మిశ్రమంలోని పదార్థాలు కుదుళ్లలోకి వెళ్లి పనిచేయడం ప్రారంభిస్తాయి. లేదంటే బ్లోయర్‌తో హెయిర్‌ని పొడిగా చేయాలి. తర్వాత 30 నిమిషాలు అలాగే ఉంచుకుని చల్లటి నీళ్లతో తలస్నానం చేయాలి. 


కొబ్బరినూనె-టీట్రీ ఆయిల్‌ మాస్క్‌

మృతకణాలు వదిలితే చుండ్రు బాధ ఉండదు. కొబ్బరినూనె యాంటిఇన్‌ఫ్లమేటరీ సబ్‌స్టెన్స్‌. టీ ట్రీ ఆయిల్‌ యాంటిఫంగల్‌ ట్రీట్‌మెంటుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

కావలసినవి: శుద్ధిచేయని కొబ్బరినూనె-రెండు టేబుల్‌స్పూన్లు, చక్కెర-నాలుగు టేబుల్‌స్పూన్లు, పిప్పరమెంట్‌ ఆయిల్‌- ఐదు చుక్కలు, టీ ట్రీ ఆయిల్‌- రెండు చుక్కలు.  

ఈ పదార్థాలన్నింటిని కలిపిన మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించాలి. మూడు నిమిషాల పాటు మసాజ్‌ చేసి కాసేపు అలాగే ఉండాలి. తర్వాత తలస్నానం చేయాలి.


 గ్రీన్‌ టీ-యాపిల్‌ సిడార్‌ మాస్క్‌

గ్రీన్‌ టీలో యాంటీ ఆక్సిడెంట్లు, న్యూట్రియంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇరిటేటింగ్‌గా ఉన్న మాడుకు సాంత్వననిస్తాయి. పిప్పర్‌మెంట్‌ ఆయిల్‌ యాంటీఇన్‌ఫ్లమేటరీ పదార్థాన్ని కలిగి ఉంటుంది. పొడారిపోయి ఉన్న మాడును మృదువుగా చేయడమేగాక తగినంత తేమను అందిస్తుంది.

కావలసినవి: గ్రీన్‌ టీ- ఒక కప్పు, పిప్పరమెంట్‌ ఆయిల్‌-2 చుక్కలు, యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌-ఒక టేబుల్‌స్పూన్‌. 

ఈ పదార్థాలన్నింటిని కలిపి మిశ్రమంలా తయారుచేయాలి. దీంతో మాడుకు బాగా మసాజ్‌ చేయాలి. ఐదు నిమిషాలు అలాగే ఉన్న తర్వాత చల్లటి నీళ్లతో తలంటు కోవాలి.


Updated Date - 2020-08-12T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising