ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెన్నెముక దృఢత్వానికి..

ABN, First Publish Date - 2020-06-06T05:30:00+05:30

భుజాలు, వెన్నెముక, నడుము, మెడ భాగాలు దృఢమవ్వడానికి సూపర్‌మ్యాన్‌ ఎక్స్‌ర్‌సైజ్‌ బాగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భుజాలు, వెన్నెముక, నడుము, మెడ భాగాలు దృఢమవ్వడానికి సూపర్‌మ్యాన్‌ ఎక్స్‌ర్‌సైజ్‌ బాగా ఉపయోగపడుతుంది. చాలా సులువుగా, పెద్దగా శ్రమ లేకుండా చేయగలిగే ఈ వ్యాయామాన్ని మీరూ ప్రయత్నించండి... 


స్టెప్‌ 1: మ్యాట్‌పై బోర్లా పడుకొని, చేతులు పైకి చాచండి. అరచేతులు ఒకదానికి ఒకటి ఎదురెదురుగా ఉండాలి. తల వెన్నుకు సమాంతరంగా ఉండాలి. ముఖం చాపను తాకాలి. ఇప్పుడు శ్వాస తీసుకోండి. ఇది మొదటి భంగిమ. 


స్టెప్‌ 2: అదే భంగిమలో ఉంటూ... కాళ్లు, భుజాల పై భాగాన్ని సాధ్యమైనంత పైకి లేపండి. పొత్తికడుపు, ఛాతీ, నడుము భాగం మాత్రమే నేలపై ఉండాలి. కాళ్లు, చేతులు వంగకూడదు. కొన్ని క్షణాలు ఇలాగే ఉండండి. ఇది రెండో భంగిమ. 


స్టెప్‌ 3: ఇప్పుడు శ్వాస తీసుకొంటూ నిదానంగా కాళ్లు, ఛాతీ పై భాగాన్ని కిందకు తీసుకురండి. అంటే మీ ప్రారంభ భంగిమలోకి రావాలి. అయితే ఇందాక చెప్పినట్టు ఛాతీ నుంచి నడుము వరకు శరీరం కదలకూడదు. ఇదే వరుసలో 10-15 సెట్లు చేయండి. 

Updated Date - 2020-06-06T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising