ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలింతలు ఇలా చేస్తే ఆరోగ్యంతో పాటు..

ABN, First Publish Date - 2020-05-10T17:05:54+05:30

బాలింతలు ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిదో వివరిస్తారా?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(10-05-2020):

ప్రశ్న: బాలింతలు ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిదో వివరిస్తారా?


- కీర్తిశ్రీ, వరంగల్‌


డాక్టర్ సమాధానం: మొదటి ఆరు నెలలు బిడ్డ పూర్తిగా తల్లి పాలపైనే ఆధారపడుతుంది. కాబట్టి ఆ సమయంలో బాలింతలు తీసుకునే ఆహారం వారికే కాక బిడ్డ ఆరోగ్యానికీ చాలా ముఖ్యం. ఆ తరవాత బిడ్డకు సంవత్సరం వచ్చే వరకు కనీసం రోజుకు ఒకటి రెండుసార్లు తల్లి పాలు ఇవ్వాలి. పాలు ఇచ్చే మొదటి ఆరు నెలలు.. తల్లి ఆహారంలో కనీసం అరవై నుండి డెబ్భై గ్రాముల మాంసకృత్తులు ఉండాలి. దీనికోసం రోజూ పాలు, పెరుగు, గుడ్లు, పప్పు ధాన్యాలు తీసుకోవాలి.  మాంసాహారులైతే వారంలో రెండుసార్లు చికెన్‌ లేదా చేప తీసుకోవాలి. రోజుకు కనీసం మూడు లీటర్ల నీళ్లు తాగాలి. బాలింతలు బరువు తగ్గాలని ఆహారాన్ని  తగ్గిసే,్త బిడ్డకు పాలు తక్కువయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి రోజులో అవసరమైన దాని కంటే రెండు నుంచి మూడు వందల కెలోరీలు తక్కువ తీసుకుంటే నెమ్మదిగా బరువు తగ్గుతారు. ఆహారం సమయానికి తీసుకోవాలి. పళ్ళు, ఆకుకూరలు, మొలకెత్తిన గింజలు అవసరమైన ఖనిజ లవణాలను అందిస్తాయి. రోజూ ముప్పై నుంచి నలభై నిమిషాల పాటు ఏదైనా వ్యాయామం లేదా వేగంగా నడవడం చేస్తే ఆరోగ్యం మెరుగ్గా ఉండడమే కాక బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను 

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2020-05-10T17:05:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising