ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒకేసారి ఇద్దరికీ వ్యాయామం

ABN, First Publish Date - 2020-05-17T05:30:00+05:30

ఏ పని చేసినా ఆస్వాదించాలే కానీ... పని కట్టుకొని చేసినట్టు ఉండకూడదు. అందుకే రొటీన్‌కు భిన్నంగా ఈసారి ఇద్దరికీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏ పని చేసినా ఆస్వాదించాలే కానీ... పని కట్టుకొని చేసినట్టు ఉండకూడదు. అందుకే రొటీన్‌కు భిన్నంగా ఈసారి ఇద్దరికీ ఒకేసారి ‘వర్కవుట్‌’ అయ్యేలా ప్రయత్నిద్దాం. 


హ్యామ్‌స్ర్టింగ్‌ స్ర్టెచ్‌: కాళ్లు కొద్దిగా ఎడం పెట్టి, ఇద్దరూ ఎదురెదురుగా నిలుచుని, చేతులు చాచండి. ఇప్పుడు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని, కుడి మోకాలిని వంచుతూ, నిదానంగా ఎడమ కాలిని వెనక్కు తీసుకువెళ్లండి. శరీరం బరువంతా కుడి మోకాలిపైనే ఉండాలి. మళ్లీ మునుపటి పొజిషన్‌కు వచ్చేయండి. ఇదే విధంగా ఎడమ మోకాలిని వంచి చేయండి. ఇలా నిమిషంలో ఎన్ని సాధ్యమైతే అన్ని ప్రయత్నించండి.


చెస్ట్‌ ఓపెనర్‌: ఇద్దరూ వెనక్కి తిరగండి. అంటే వీపులు ఎదురెదురుగా ఉండాలి. చేతులు వెనక్కు పెట్టండి. ఒకరి చేతులు ఒకరు పట్టుకొని, ఒకరినొకరు లాగుతున్నట్టు నెమ్మదిగా ఒక్కో అడుగు ముందుకు కదపండి. అలా సాధ్యమైనంత స్ర్టెచ్‌ చేసి, ఐదు లెక్కపెట్టే వరకు ఉండి, తరువాత మొదటి భంగిమలోకి రండి. ఇలాగే మళ్లీ చేస్తూ, కౌంట్‌ పెంచుతూ వెళ్లండి. 


ఇన్నర్‌-థై స్ర్టెచ్‌: ఎదురెదురుగా నేలపై కూర్చొని, కాళ్లను వీలైనంత ఎడంగా జాపండి. చేతులు ముందుకు చాచి, పట్టుకోండి. మోకాళ్లు వంగకూడదు. ఇప్పుడు ఒకళ్లనొకళ్లు లాగుతూ సాధ్యమైనంత ముందుకు వంగండి. తొడ కండరాల్లో కొద్దిగా నొప్పి అనిపిస్తుంది. ఇలా ఎన్ని సార్లు చేయగలిగితే అన్నిసార్లు చేయండి.

Updated Date - 2020-05-17T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising