ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎండు ఖర్జూరాలు తింటే చాలు

ABN, First Publish Date - 2020-10-06T20:13:21+05:30

ఆడవాళ్లను అధికంగా వేధించే సమస్య రక్తహీనత. దీనివల్ల విపరీతమైన నీరసం వచ్చేస్తుంది. పనులు చురుగ్గా చేయలేరు. ఫలితంగా నిస్సహాయత, చీటికిమాటికి కోపం. పోషకాహార లోపం వల్ల కూడా రక్త హీనత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(06-10-2020)

ఆడవాళ్లను అధికంగా వేధించే సమస్య రక్తహీనత. దీనివల్ల విపరీతమైన నీరసం వచ్చేస్తుంది. పనులు చురుగ్గా చేయలేరు. ఫలితంగా నిస్సహాయత, చీటికిమాటికి కోపం. పోషకాహార లోపం వల్ల కూడా రక్త హీనత ఏర్పడవచ్చు. సరైన ఆహారాన్ని తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ప్రతిరోజూ నాలుగు ఎండు ఖర్జూరాలను నీళ్లలో నానబెట్టుకుని మరుసటి ఉదయాన్నే వాటిని తినాలి. ఇలా రోజూ తినడం వల్ల రక్తహీనత నుంచి త్వరగా బయటపడవచ్చు. అలాగే బెల్లంతో చేసిన నువ్వుల లడ్డూను రోజూ రాత్రి పడుకోబోయే ముందు తిన్నా మంచిదే. రోజుకో దానిమ్మ పండు తినాలి. వారంలో రెండు మూడు సార్లయినా బీట్‌ రూట్‌ కూర తినాలి. ఇవే కాదు ఆపిల్‌, అరటిపండు, మెంతికూర, గోంగూర, పాలకూర, తేనె, పాలు, పెరుగు, ఉసిరి కాయలు, కిస్‌మిస్‌లు... వంటివి తరచూ తినడం అలవాటు చేసుకోవాలి. ఇక మాంసాహారం తినేవాళ్లు బోన్స్‌తో సూప్‌ చేసుకుని తాగినా మంచిదే. ఉసిరి చూర్ణం కూడా రక్తహీనత సమస్య ఉన్నవారికి మంచి చేస్తుంది. ఒక చెంచా చూర్ణంలో తేనె కలిపి తాగితే  సమస్య నుంచి బయటపడవచ్చు. 

Updated Date - 2020-10-06T20:13:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising