ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గర్భిణులకు మధుమేహం వస్తే....

ABN, First Publish Date - 2020-10-17T20:43:46+05:30

గర్భం దాల్చిన మహిళలలో కొందరికి నాలగో నెల దాటిన తరువాత శరీరంలో హార్మోన్ల ప్రభావం వల్ల రక్తంలో చక్కర శాతాన్ని నియంత్రించడం కష్టమవుతుంది. ఈ రకమైన మధుమే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(06-10-2020)

ప్రశ్న: గర్భిణులలో వచ్చే మధుమేహానికి ఎటువంటి ఆహార జాగ్రత్తలు పాటించాలి?


-విజయలక్ష్మి, ఆదిలాబాద్‌


డాక్టర్ సమాధానం: గర్భం దాల్చిన మహిళలలో కొందరికి నాలగో నెల దాటిన తరువాత శరీరంలో హార్మోన్ల ప్రభావం వల్ల రక్తంలో చక్కర శాతాన్ని నియంత్రించడం కష్టమవుతుంది. ఈ రకమైన మధుమేహాన్ని జెస్టేషనల్‌ డయాబెటిస్‌ అంటారు. సమతుల, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా దీన్ని నియంత్రించవచ్చు. పిండి పదార్థాలను మితంగా తీసుకోవాలి కానీ పూర్తిగా మానేయకూడదు. రక్తంలో గ్లూకోజు హెచ్చుతగ్గులు లేకుండా ఉండడానికి కొద్ది పాటి ఆహారాన్ని ఎక్కువ సార్లు తీసుకోవచ్చు. ఉదయం అల్పాహారం తరువాత రెండు గంటలకు కొద్దిగా పండ్లు లేదా పాలు తీసుకోవచ్చు. అలాగే సాయంత్రం కూడా బాదం, ఆక్రోట్‌ లాంటి గింజలు, ఉడికించిన సెనగలు, మజ్జిగ తీసుకో వచ్చు. రాత్రి భోజనం తొందరగా చేసి నిద్రపోయే ముందు ఓ కప్పు పాలు తాగండి. స్వీట్లు చక్కెర లేదా బెల్లంతో చేసినవైనా పూర్తిగా మానెయ్యాలి. భోజనంలో అన్నం కంటే కూరలు, పప్పే ఎక్కువగా తీసుకోవాలి. ఆహార జాగ్రత్తలతో పాటు వైద్యుల సలహామేరకు ఉదయం, సాయంత్రం కూడా కొద్దిపాటి నడక తప్పనిసరి. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2020-10-17T20:43:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising