ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరివేపాకు.. ఆరోగ్యానికి మందూ మాకూ..

ABN, First Publish Date - 2020-09-10T05:30:00+05:30

కూరల్లో కరివేపాకు ఉండాల్సిందే. రుచితో పాటు పోషకాలను అందించే కరివేపాకును ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక లాభాలున్నాయి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు డాక్టర్‌ దిక్సా భావ్సర్‌...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కూరల్లో కరివేపాకు ఉండాల్సిందే. రుచితో పాటు పోషకాలను అందించే కరివేపాకును ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక లాభాలున్నాయి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు డాక్టర్‌ దిక్సా భావ్సర్‌. ప్రతిరోజు ఏడు నుంచి పది కరివేపాకులను తింటే కలిగే ఆరోగ్య లాభాలను చెబుతున్నారామె. జుట్టురాలడం, జుట్టు నెరవడం వంటి సమస్యలను కరివేప తగ్గిస్తుంది. అలానే వెంట్రుకలు పెరిగేందుకు సాయపడుతుంది. 



ఎలా తీసుకోవాలంటే...

కరివేపాకులను నేరుగా తిని తరువాత కొన్ని నీళ్లు తాగాలి. లేదంటే కప్పు నీళ్లలో కరివేపాకులు వేసి 5 నిమిషాలు మరిగించాలి. ఇప్పుడు కరివేపాకులను తీసేసి, గోరువెచ్చగా ఉండగానే ఆ నీళ్లను తాగాలి. ఇలాచేస్తే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. అంతేకాదు చిన్నచిన్న ఆరోగ్య సమస్యలకు కరివేప ఔషధగా పనిచేస్తుంది. అవేమిటంటే...


వికారం: ఈ సమస్య తగ్గాలంటే ఆరు తాజా కరివేపాకులను తీసుకొని శుభ్రంగా కడిగి ఎండబెట్టాలి. తరువాత వాటిని అరటీస్పూన్‌ నెయ్యి వేసి ఫ్రై చేయాలి. చల్లారాక నమిలి తినాలి. 

దుర్వాసన: అయిదు తాజా కరివేపాకులు తీసుకొని నోటిలో వేసుకోవాలి. అయిదు నిమిషాలు నమలాలి. తరువాత నీళ్లతో పుక్కిలించాలి. దీంతో నోటి దుర్వాసన తగ్గుతుంది. 

విరేచనాలు: ముప్ఫయి కరివేపాకులు తీసుకొని పేస్ట్‌లా రుబ్బుకోవాలి. ఈ పేస్ట్‌ను మజ్జిగలో కలిపి తాగితే విరేచనాలు తగ్గుతాయి.

మధుమేహం: కరివేపాకులతో చట్నీ చేయాలి. ఈ చట్నీని అన్నం లేదా రోటీతో తింటే చక్కెర అదుపులో ఉంటుంది. 

నోటిలో పుండ్లు: కరివేపాకు పొడిని తేనెతో కలిపి నోటిలోని పుండ్ల మీద రాయాలి. ఇలా రెండు మూడు రోజులు చేస్తే ఉపశమనం లభిస్తుంది.

Updated Date - 2020-09-10T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising