ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్యాలెన్స్‌ కోసం...

ABN, First Publish Date - 2020-06-01T05:30:00+05:30

‘బ్యాలెన్స్‌’ జీవితానికే కాదు... శరీరానికీ ముఖ్యమే. అందుకే వ్యాయామాల్లో బ్యాలెన్స్‌, స్టెబిలిటీ ట్రైనింగ్‌ తప్పనిసరిగా ఉండాలి. దానివల్ల మోకాళ్లు, మడమలు, భుజాలు, నడుము పట్టు తప్పకుండా స్థిరంగా ఉంటాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘బ్యాలెన్స్‌’ జీవితానికే కాదు... శరీరానికీ ముఖ్యమే. అందుకే వ్యాయామాల్లో బ్యాలెన్స్‌, స్టెబిలిటీ ట్రైనింగ్‌ తప్పనిసరిగా ఉండాలి. దానివల్ల మోకాళ్లు, మడమలు, భుజాలు, నడుము పట్టు తప్పకుండా స్థిరంగా ఉంటాయి. ఫలితంగా కాళ్లు బెణకడం, తీవ్రమైన మోకాళ్ల నొప్పులు, ఇతర గాయాల నుంచి దూరంగా ఉండవచ్చు. సో... ఈ రోజు బ్యాలెన్స్‌, స్టెబిలిటీని మెరుగుపరుచుకొనే వర్కవుట్స్‌ ప్రయత్నిద్దాం...


సుమో స్క్వాట్‌లా..: పాదాల మధ్య భుజాలంత దూరం పెట్టి నిల్చోండి. బ్యాలెన్స్‌ కోసం రెండు చేతులనూ పట్టుకోండి. భుజాల ఎత్తులో, శరీరానికి దగ్గరగా చేతులు ఉండాలి. మోకాళ్లు వంచి, నడుము పై భాగాన్ని నిటారుగా పెట్టండి. సుమో స్క్వాట్‌లా భంగిమ ఉండాలి. మళ్లీ మునుపటి పొజిషన్‌కు వచ్చి, ఎడమ కాలిని పక్కనుంచి సాధ్యమైనంత పైకి లేపండి. పది సెకన్ల తరువాత ప్రారంభ భంగిమలోకి వచ్చేసి, ఇదే విధంగా కుడి కాలితో ప్రయత్నించండి. ఇలా ఒక్కో వైపు 15 సార్లు చేయండి.




ఒంటి కాలితో..: కాళ్ల మధ్య కొద్దిగా దూరం పెట్టి నిల్చోండి. ఈ చిత్రంలో చూపినట్టు నిదానంగా ఎడమ కాలు పైకి లేపి, కుడి కాలిపై బ్యాలెన్స్‌ చేసుకోండి. ఎడమ కాలు, నడుము పై భాగం... నేలకు సమాంతరంగా ఉండాలి. కుడి కాలు వంగకూడదు. చేతులు కిందకి, అంటే కుడి కాలికి సమాంతరంగా చాచాలి. ఇప్పుడు మొదటి పొజిషన్‌కు వచ్చి, ఎడమ మోకాలిని సాధ్యమైనంత ఛాతీకి దగ్గరగా తీసుకురండి. ఇలా 12 సార్లు చేసి, కాలు మార్చండి.




చెట్టులా..: పాదాలు రెండూ ఆనించి నిల్చోండి. వెన్నెముక నిటారుగా ఉండాలి. భుజాల ఎత్తులో చేతులు పూర్తిగా చాచండి. భంగిమ చూడ్డానికి ఆంగ్ల అక్షరం ‘టి’లా ఉండాలి. నెమ్మదిగా ఎడమ కాలిని లేపి, పాదాన్ని కుడి కాలి పిక్కకు తగిలించండి. చేతులు పట్టుకొని, తలపై నుంచి పైకి ఎత్తండి. 30 సెకన్ల తరువాత కుడి కాలితో చేయండి. ఇలా చేయగలిగినన్ని చేయండి.


Updated Date - 2020-06-01T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising