ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెదవులు పగలకుండా...

ABN, First Publish Date - 2020-10-08T05:30:00+05:30

వంటింట్లో ఉండే నెయ్యితో ఆహారానికి రుచిని తేవడంతో పాటు అందాన్ని పెంచుకోవచ్చు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వంటింట్లో ఉండే నెయ్యితో ఆహారానికి రుచిని తేవడంతో పాటు అందాన్ని పెంచుకోవచ్చు.  

  1. కొద్దిగా నెయ్యిని పచ్చి పాలు, సెనగపిండిలో వేసి పేస్ట్‌ తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్‌ను చర్మానికి రాసుకొని నెమ్మదిగా మసాజ్‌ చేసుకోవాలి. 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్‌ప్యాక్‌ను తరచూ వాడితే చర్మానికి తేమ అందుతుంది. నిగారింపు కూడా సొంతమవుతుంది. 
  2. పొడిబారిన, పగుళ్ళు ఏర్పడిన పెదవులకు నెయ్యి చక్కగా పనిచేస్తుంది. రాత్రిపూట నిద్రపోయే ముందు పెదవులకు నెయ్యి రాసుకొని, మర్ధన చేయాలి. ఉదయాన్నే నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే పెదవులు పొడిబారడం తగ్గిపోతుంది. 
  3. తేమ, పోషణ అందకపోవడం వల్ల కురులు నిర్జీవంగా కనిపిస్తాయి.  టేబుల్‌స్పూన్‌ నెయ్యిని వేడిచేసి చల్లార్చాలి. తరువాత ఆ నెయ్యిని జుట్టుకు పట్టించాలి. రెండు గంటలు అలానే ఉండాలి. తరువాత షాంపూతో తలంటుకుంటే కేశాలు జీవాన్ని పొంది పట్టులా మెరుస్తాయి.
  4. కొంచెం నెయ్యి తీసుకొని, చర్మానికి మసాజ్‌ చేస్తున్నట్టుగా రాసుకోవాలి. కొద్దిసేపు అలానే ఉండి తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. నెయ్యిలో చర్మాన్ని యవ్వనంగా కనిపించేలా చేసే గుణాలున్నాయి. ఇవి వయసుతో  వచ్చే ముడతలను తగ్గించి, చర్మాన్ని బిగుతుగా మారుస్తాయి.

Updated Date - 2020-10-08T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising