ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆయుర్వేదంతో కరోనాకు చెక్ పెట్టొచ్చు.. హెల్త్ టిప్స్: డాక్టర్ ఆనంద్

ABN, First Publish Date - 2020-04-03T18:31:54+05:30

ఆయుర్వేదంలోని సంప్రదాయక పద్ధతులతో కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఆయుర్వేదంలోని సంప్రదాయక పద్ధతులతో కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ప్రముఖ డాక్టర్, ఆయుర్వేదంలో యం.డి చేసి, చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఆనంద్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. కరోనా అనే వైరస్ మానవ శరీరంలో ముఖ్యంగా శ్వాస వ్యవస్థపై అత్యధిక ప్రభావం చూపిస్తుందని, అలాగే వ్యాధి నిరోధక శక్తిని హరింప చేస్తుందన్నారు. దీనికి ఆయుర్వేదంలో విరుగుడులు ఉన్నాయని చెప్పిన ఆనంద్.. దైనందిక జీవితంలో వాడే, సులభంగా దొరికే మొక్కలు, ఔషధాల గురించి వివరించారు. ‘విటమిన్ సి’ అధికంగా వుండే ఉసిరి కాయలతో తయారయ్యే చ్యవన్ ప్రాష్, తులసి, దాల్చినీ వాడకం, పసుపు కలిపిన వేడి పాలు ప్రతి రోజూ రెండు సార్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు.   


ఇవి చేయండి... మరిన్ని హెల్త్ టిప్స్


1. కొబ్బరి నూనె లేదా తిల తైలం రెండు చుక్కలు నాసిక ఇరు రంధ్రాలలో వేసి ప్రతి మర్శ నస్య కర్మను చేయడం

2. ఒక చెంచాడు కొబ్బరి లేదా తిల తైలం నోటి లోపల ఉంచి గండూష కర్మ (గార్గ్లింగ్) చేయడం

3. పుదీనా వేడి నీటిలో ఉడికించి ఆ నీటితో ఆవిరి పట్టడం 

4. లవంగ చూర్ణం తేనే కలిపి తీసుకోవడం 

5. ప్రతి రోజు వేడి చేసిన నీటిని త్రాగడం

6. యోగాసన ,మెడిటేషన్ 30 నిమిషాల పాటు చేయడం

7. వంటలలో పసుపు, జీల కర్ర, అల్లం, వెల్లుల్లి, ధనియాల వాడకం

8. మానసికంగా బలంగా ఉండడానికి డాక్టర్ సలహా తీసుకొని బ్రాహ్మి, జటామాంసి, యష్టి మధు, సరస్వతి లాంటి ఔషధాలు వాడవచ్చు.

9. లక్షణాలు కనిపిస్తున్నప్పుడు దగ్గరలో ఉన్న ఆసుపత్రికి వెళ్ళి, తగు పరీక్షలు చేయించుకోవాలి, భౌతిక దూరం, పరిశుభ్రత పాటించాలి.


Updated Date - 2020-04-03T18:31:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising