ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రీన్‌ టీ ఎప్పుడు తాగాలంటే...

ABN, First Publish Date - 2020-10-25T21:12:18+05:30

గ్రీన్‌ టీ తాగడం వల్ల అన్నీ లాభాలే కానీ, నష్టాలు లేవనుకుంటారు చాలామంది. నిజానికి దాన్ని తాగాల్సిన పద్ధతిలో తాగకపోతే నష్టాలు కూడా భరించాల్సి రావచ్చు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ్రీన్‌ టీ తాగడం వల్ల అన్నీ లాభాలే కానీ, నష్టాలు లేవనుకుంటారు చాలామంది. నిజానికి దాన్ని తాగాల్సిన పద్ధతిలో తాగకపోతే నష్టాలు కూడా భరించాల్సి రావచ్చు. గ్రీన్‌ టీని ఎప్పుడు పడితే అప్పుడు తాగకూడదు. పొట్ట నిండుగా భోజనం చేశాక గ్రీన్‌ టీని తీసుకోవద్దు. ఎందుకంటే ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియకు ఆటంకం కలగవచ్చు. బాగా వేడిగా ఉన్నప్పుడు కూడా గ్రీన్‌ టీ తాగకూడదు. అధిక ఆరోగ్య లాభాలు కలగలంటే గోరువెచ్చగా తాగాలి. అలాగే ఖాళీ పొట్టతో ఈ టీ తాగడం కూడా మంచిది కాదు.


ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల పొట్టలో ఆమ్లాలు ఉత్పత్తి అయి కడుపు మంట, నొప్పి లాంటివి కలగవచ్చు లేదా జీర్ణక్రియ సరిగా జరగకపోవచ్చు. కాబట్టి రెండు భోజనాల సమయాలకు మధ్యలో తాగడం ఉత్తమం. గ్రీన్‌ టీలో తేనె కలుపుకుని తాగితే చాలా మంచిది. కానీ టీ వేడిగా ఉన్నప్పుడు కలిపితే తేనెలో సుగుణాలు నశిస్తాయి. గోరువెచ్చగా మారాక కలుపుకోవడం ఉత్తమం. అన్నిటికన్నా ముఖ్యంగా గ్రీన్‌ టీని కూర్చుని తాపీగా తాగాలి. 

Updated Date - 2020-10-25T21:12:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising