ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రేవీ చిక్కగా...

ABN, First Publish Date - 2020-02-26T05:30:00+05:30

గ్రేవీ పలచగా అయినపుడు... అందులో ఉడికించిన బంగాళాదుంపను మెత్తగా చేసి కలిపితే గ్రేవీ చిక్కగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ్రేవీ పలచగా అయినపుడు... అందులో ఉడికించిన బంగాళాదుంపను మెత్తగా చేసి కలిపితే గ్రేవీ చిక్కగా తయారవుతుంది. 

అన్నం వండేటప్పుడు అందులో కొద్దిగా వంటనూనె వేస్తే అన్నం ముద్దవకుండా పొడి పొడిగా వస్తుంది.

పులుసు కూరల్లో చింతపండు రసానికి బదులు టొమాటో గుజ్జు వేస్తే కూరలు ఎంతో రుచిగా ఉంటాయి.

కారం నిల్వ ఉంచిన డబ్బాలో చిటికెడు ఇంగువ కలిపితే కారం పురుగుపట్టదు. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.

కూరల్లో కారానికి బదులు పచ్చిమిరపకాయలు వాడితే శరీరంలోని కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది.

కూరల్లో వేసే పచ్చిబఠాణీలు తొందరగా నానాలంటే  వేడి నీటిలో కొద్దిగా వంట సోడా వేసి రెండు గంటలు ఉంచాలి. తర్వాత కూరలో ఉపయోగించుకోవచ్చు.

బిస్కెట్లు నిల్వ ఉంచిన డబ్బాలో కొద్దిగా పంచదార వేస్తే అవి మెత్తబడవు.

బొంబాయి రవ్వను వేగించి నిల్వచేస్తే తొందరగా పురుగు పట్టదు. 

కొబ్బరి చిప్పను స్టవ్‌ మీద కాసేపు వేడి చేయాలి. చల్లారిన తర్వాత పగలగొడితే లోపలి కొబ్బరి ఇట్టే బయటకు వచ్చేస్తుంది.

Updated Date - 2020-02-26T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising