ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సామాజిక ఎడబాటుతో అనర్థం

ABN, First Publish Date - 2020-11-16T05:47:38+05:30

ఒంటరితనం, సామాజిక ఎడబాటు వంటివి మహిళల్లో బి.పి పెరిగేందుకు కారణమవుతాయని తాజా అధ్యయనం చెబుతోంది. బ్రిటీషు కొలంబియా యూనివర్సిటీ ‘హైపర్‌టెన్షన్‌’ జర్నల్‌లో ప్రచురించిన ఈ అధ్యయనం వివరాలివి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంటరితనం, సామాజిక ఎడబాటు వంటివి మహిళల్లో బి.పి పెరిగేందుకు కారణమవుతాయని తాజా అధ్యయనం చెబుతోంది. బ్రిటీషు కొలంబియా యూనివర్సిటీ ‘హైపర్‌టెన్షన్‌’ జర్నల్‌లో ప్రచురించిన ఈ అధ్యయనం వివరాలివి. సామాజిక వెలి అనేది పురుషులు, మహిళల్లో భిన్నమైన ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మహిళల్లో బి.పి అధికమయ్యేందుకు దారి తీస్తుంది. పరుషులతో పోలిస్తే సామాజికంగా మంచి అనుబంధం లేని నడి వయసు, పెద్ద వయసు మహిళల్లో గుండె సమస్యలకు దారితీసే బి.పి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.


‘‘పెద్దవాళ్లలో పొగతాగడం తరువాత ప్రాణాంతకంగా పరిణమించే వాటిలో సామాజిక ఎడబాటు ఒక ప్రధాన కారణం’’ అంటున్నారు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అన్నాలిజిన్‌ కాంక్లిన్‌. అధ్యయనంలో 45 నుంచి 85 ఏళ్ల మధ్య వయసున్న 28,238 మందిని పరిశీలించారు. భాగస్వామి లేని మహిళలు, నెలలో మూడు కన్నా తక్కువ సామాజిక కార్యక్రమాల్లో భాగంకాని వారు, 85 మంది కన్నా తక్కువ మందితో పరిచయం ఉన్నవారిలో అధిక బి.పి ముప్పు ఎక్కువని పరిశోధకులు గుర్తించారు. భర్త చనిపోయిన మహిళలు, భర్త ఉన్న మహిళల్లో బి.పి హెచ్చుతగ్గులు ఉన్నట్లు తేలింది. ‘కరోనా భయంతో ప్రస్తుతం మేము అందరినీ కలవడం లేదు. అయితే వయసు పైబడిన వారు నలుగురితో మాట్లాడడం ఎంత ముఖ్యమో ప్రజారోగ్యం విధుల్లో ఉన్నవారు తెలియజెప్పాలి’ అంటున్నారు పరిశోధకులు. 

Updated Date - 2020-11-16T05:47:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising