ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంట్లో వేధింపులు ఎలా ఆపాలి?

ABN, First Publish Date - 2020-05-14T07:51:32+05:30

నాకు నాలుగేళ్ళ క్రితం వివాహం జరిగింది. పెళ్ళయిన ఆరు నెలల నుంచే గృహ హింస మొదలయింది. నా భర్త, అత్తమామలు, ఆడపడుచు, ఆమె భర్త... వీరందరూ కలిసి నన్ను ఇంకా కట్నం తెమ్మంటూ శారీరకంగా, మానసికంగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాకు నాలుగేళ్ళ క్రితం వివాహం జరిగింది. పెళ్ళయిన ఆరు నెలల నుంచే గృహ హింస మొదలయింది. నా భర్త, అత్తమామలు, ఆడపడుచు, ఆమె భర్త... వీరందరూ కలిసి నన్ను ఇంకా కట్నం తెమ్మంటూ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారు. నా జీతం కూడా వాళ్ళే తీసుకుంటున్నారు. ఈ వేధింపులను ఎలా ఆపాలి?

- సుజిత


నాలుగేళ్లుగా వేధింపులు భరిస్తున్నానని అంటున్నారు. కానీ సమస్య పరిష్కారానికి మీరు ఏ ప్రయత్నాలు చేశారో తెలియజేయలేదు. మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారో, మీకు మీ పుట్టింటివారి ఆసరా ఉందో లేదో వెల్లడించలేదు. అత్తింటి వారు కట్నం కోసం పాల్పడే వేధింపులపై చట్టపరంగా మీరు చర్యలు తీసుకోవచ్చు. దానికి మీరు న్యాయవాదిని సంప్రతిస్తే అన్నీ వివరంగా చెబుతారు. ఈ లాక్‌ డౌన్‌ సమయంలో మహిళలపై వేధింపులు మరింత పెరిగాయని వివిధ అధ్యయనాల్లో వెల్లడైంది. మీరు కూడా మరింతగా హింసను ఎదుర్కొంటూ ఉండి ఉంటారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పోలీసుల జోక్యం, కేసులు సాధ్యం కాకపోవచ్చు. వీలయితే జాతీయ మహిళా కమిషన్‌ హెల్ప్‌ లైన్‌ నెంబర్‌కు ఫిర్యాదు చేయండి. (వాట్సాప్‌ నెంబర్‌ - 7217735372)

-కె. శోభ, ఫ్యామిలీ కౌన్సెలర్‌, హార్ట్‌ టు హార్ట్‌ shobhas292@gmail.com

Updated Date - 2020-05-14T07:51:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising