ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిందలపాలయ్యా!

ABN, First Publish Date - 2020-07-16T05:30:00+05:30

నా వయసు 26 సంవత్సరాలు. ఉద్యోగం చేస్తున్నాను. మా చుట్టాలబ్బాయి ప్రేమిస్తున్నానంటూ నన్ను విసిగించేవాడు. నేను చాలాసార్లు తిరస్కరించాను. తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నాడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నా వయసు 26 సంవత్సరాలు. ఉద్యోగం చేస్తున్నాను. మా చుట్టాలబ్బాయి ప్రేమిస్తున్నానంటూ నన్ను విసిగించేవాడు. నేను చాలాసార్లు తిరస్కరించాను. తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నాడు. తన మరణానికి అప్పులు, ప్రేమ వైఫల్యం కారణాలుగా చివరి ఉత్తరంలో పేర్కొన్నాడు. దాంతో మా చుట్టాలందరూ నా గురించి చెడుగా ప్రచారం చేశారు. నేను ఎన్నడూ అతనితో మాట్లాడింది లేదు, తిరిగిందీ లేదు. ఏ తప్పూ చెయ్యకపోయినా ఇలా నిందలపాలు అయ్యాను. నేను పెళ్ళి చేసుకుందామనుకున్న సమయంలో ఇలా జరిగింది. నాకు తండ్రి లేడు. తల్లి మాత్రమే ఉంది. ఈ సమస్య నా పెళ్ళికి ఆటంకం కాకుండా ఎలా పరిష్కరించుకోవాలో తెలియడం లేదు.

- రమ


మీ ప్రమేయం లేకుండా జరిగిన వాటికి మీరు బాధపడనక్కరలేదు. ఎవరో ఏదో అన్నారనో, అంటారనో పట్టించుకోకండి. లోకం అంతే! బాధపెట్టాలనే చూస్తుంది. లెక్కచేయకుండా సాగిపోవడమే విజ్ఞత. అయితే బంధువులే ఆడపిల్లపై ఇటువంటి నిందలు వేయడం విచారకరం. నిజానికి తండ్రి లేని అమ్మాయికి వారు మరింత అండగా ఉండాలి. మీరీ విషయాలేమీ పట్టించుకోకండి. ఉద్యోగంపైనే దృష్టి పెట్టండి. వీలయితే వేరే ఊరు బదిలీ చేయించుకోండి. నిరభ్యంతరంగా పెళ్ళి ప్రయత్నాలు సాగించండి. సహృదయులెవరూ ఇటువంటి చిల్లర ప్రచారం పట్టించుకోరు.

- కె.శోభ, ఫ్యామిలీ కౌన్సెలర్‌, ‘హార్ట్‌ టు హార్ట్‌’, shobhas929@gmail.com


Updated Date - 2020-07-16T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising