ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంటిపట్టునే వ్యాయామం!

ABN, First Publish Date - 2020-03-16T05:52:36+05:30

వేసవిలో బరువు తగ్గడం తేలిక. కాబట్టి ఈ కాలాన్ని శరీరంలో పేరుకున్న కొవ్వును కరిగించుకోవడానికి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేసవిలో బరువు తగ్గడం తేలిక. కాబట్టి ఈ కాలాన్ని శరీరంలో పేరుకున్న కొవ్వును కరిగించుకోవడానికి ఉపయోగించుకోవాలి. ఇందుకోసం జిమ్‌కు వెళ్లలేని వారు ఇంట్లోనే కొవ్వు కరిగించే వ్యాయామాలు చేసుకోవచ్చు. 


కాంబో వర్కవుట్‌!

హై నీస్‌: కాళ్ల మధ్య అడుగు దూరం ఉండేలా నిలబడాలి. మోకాళ్లను మడిచి నడుము దగ్గరకు మార్చి, మార్చి లేపుతూ ఉండాలి. ఇలా కాళ్లను లేపినప్పుడు చేతులతో మోకాళ్లను తాకుతూ ఉండాలి. ఇలా 30 సెకండ్ల పాటు చేయాలి.

బర్ఫీ: రెండు చేతులు గాల్లోకి లేపి ఎగరాలి. వెంటనే ముందుకు నేల మీద పడుకోవాలి. ఆలస్యం చేయకుండా లేచి నిలబడి మళ్లీ గాల్లోకి లేవాలి. ఇలా 30 సెకండ్ల పాటు చేయాలి.

మౌంటెయిన్‌ క్లైంబ్‌: చేతులు, పాదాల ఆసరాతో నేల మీద బోర్లా పడుకోవాలి. ఈ భంగిమలో మిగతా శరీరం నేలను తాకకూడదు. ఈ భంగిమలో ఉండి, పర్వతం ఎక్కుతున్నట్టుగా కాళ్లను నడుము దగ్గరకు, కిందకూ మార్చి, మార్చి కదిలించాలి. ఇలా 30 సెకండ్ల పాటు చేయాలి.

ప్లాంక్‌: మోచేతులు, పాదాల ఆసరాతో నేల మీద బోర్లా పడుకోవాలి. ఈ భంగిమలో మిగతా శరీరం నేలను తాకకూడదు. ఇలా 30 సెకండ్లు ఉండాలి.

ఈ వ్యాయామాలు 3 సెట్లు చేయాలి.

Updated Date - 2020-03-16T05:52:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising