ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ కాలంలో తినదగ్గవి!

ABN, First Publish Date - 2020-12-31T05:49:34+05:30

సీజన్‌ మారిందంటే చాలు అందుకు తగ్గ ఫ్యాషన్‌ అనుసరిస్తాం. అలానే సీజన్‌కు సరిపడా ఆహారం తీసుకోవడం కూడా అంతే ముఖ్యం అంటున్నారు ఆహార నిపుణులు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీజన్‌ మారిందంటే చాలు అందుకు తగ్గ ఫ్యాషన్‌ అనుసరిస్తాం. అలానే సీజన్‌కు సరిపడా ఆహారం తీసుకోవడం కూడా అంతే ముఖ్యం అంటున్నారు ఆహార నిపుణులు. చలికాలంలో కాలుష్యం, కరోనా వైరస్‌ నుంచి రక్షణ పొందేందుకు ఏం చేయాలో చెబుతున్నారిలా...


బెల్లం:

దీనిలో శరీరాన్ని వెచ్చగా ఉంచే గుణాలు మెండుగా ఉంటాయి. బెల్లంలోని ఐరన్‌ హీమోగ్లోబిన్‌ ఉత్పత్తికి దోహదపడుతుంది. బెల్లం తింటే జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. ఒంట్లోని మలినాలు, బి.పి ఎక్కువ ఉన్నవారు బెల్లం తింటే మంచిది. అందుకే ఈ సీజన్‌లో రోజూ ఏదో రూపంలో కొద్దిగా బెల్లం తినాలి. 




వెల్లుల్లి:

వివిధ రకాల క్రిములతో పోరాడే గుణాలు వెల్లుల్లి సొంతం. వెల్లుల్లి తింటే రోగనిరోధకశక్తి పెరుగుతుంది కూడా. దీనిలోని సల్ఫర్‌ సాధారణ జలుబు, జ్వరం నుంచి రక్షణ కల్పించే తెల్లరక్తకణాల శక్తిని పెంచుతుంది. 


పసుపు:

ఈ సుగంధద్రవ్యంలోని కర్‌క్యుమిన్‌ అనే పదార్థం ఫ్రీరాడికల్స్‌ వల్ల జరిగే నష్టాన్ని నివారిస్తుంది. నల్ల మిరియాలలోని పైపెరిన్‌, కర్‌క్యుమిన్‌తో కలిసి కాల్షియం శోషణను పెంచుతుంది. 


చిరుధాన్యాలు:

సబ్జా, రాగి, స్వీట్‌కార్న్‌లలో మేలైన పిండిపదార్థం ఉంటుంది. ప్రొటీన్‌, ఫైబర్‌ కూడా ఎక్కువే. ఈ చిరుధాన్యాలు కొలెస్ట్రాల్‌  నిల్వల్ని పెరగకుండా చూస్తాయి. 


గ్రీన్‌ స్మూతీలు, జ్యూస్‌:

వేపుడు పదార్థాలు తినడం వల్ల ఒంట్లో చేరిన హానికర పదార్థాలను ఆకుకూరలతో చేసిన స్మూతీలు, వెజిటబుల్‌ జ్యూస్‌ తొలగిస్తాయి. 

Updated Date - 2020-12-31T05:49:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising