ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒత్తిడి తెచ్చే కష్టాలు

ABN, First Publish Date - 2020-08-20T05:30:00+05:30

పని నుంచి బంధాల వరకూ ఏదైనా కూడా ఒత్తిడికి కారణం కావొచ్చు. కానీ చాలామందికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పని నుంచి బంధాల వరకూ ఏదైనా కూడా ఒత్తిడికి కారణం కావొచ్చు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే దీర్ఘకాల ఒత్తిడి ఆరోగ్యాన్ని ఛిన్నాభిన్నం చేయడమే కాదు దాని ప్రభావం చర్మం, వెంట్రుకల మీద బాగా పడుతుంది. అదెలాగంటే...

  1.  ఒత్తిడి వల్ల కోర్టిసాల్‌ అనే హార్మోన్‌ ఉత్పత్తి అవుతుంది. దీన్ని స్ట్రెస్‌ హార్మోన్‌ అని కూడా అంటారు. ఇది చర్మం ముడతలు పడడానికి కారణమవుతుంది. 
  2.  ఒత్తిడి హార్మోన్‌ శరీరమంతటా మంటపుట్టిస్తుంది. దీనివల్ల మనం తొందరగా బ్రేకవుట్‌ అవుతుంటాం. ఒత్తిడి  వల్ల చర్మంపై యాక్నే తలెత్తుతుంది.
  3.  స్ర్టెస్‌ కారణంగా చర్మంలో రకరకాల సమస్యలు తలెత్తుతాయి. ఎగ్జిమా లేదా సొరియాసిస్‌ వచ్చే అవకాశం ఉంది. ఒత్తిడి అధికమవుతే ఈ సమస్యలు మరింత తీవ్రతరమవుతాయి. 
  4.  ఒత్తిడి కారణంగా చర్మం మీద శ్రద్ధ తీసుకోం. అంటే ఎక్స్‌ఫొయిలేషన్‌, మాయిశ్చరైజేషన్‌, సన్‌స్ర్కీన్‌ విషయాలలో ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోలేము. ఫలితంగా చర్మం బాగా డల్‌ అయి రూపురేఖలు కాంతివిహీనంగా మారతాయి. 
  5.  ఒత్తిడి కారణంగా మాడుకు రకరకాల సమస్యలు తలెత్తుతాయి. ఒత్తిడి వల్ల మాడు పొడారినట్టవుతుంది. లేదా బాగా జిడ్డుగా తయారవుతుంది. దీనివల్ల చుండ్రు, దురద లాంటి సమస్యలు తలెత్తుతాయి.

Updated Date - 2020-08-20T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising