ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూరిక్‌ యాసిడ్‌తో తగ్గే ఆయుష్షు!

ABN, First Publish Date - 2020-11-10T06:19:30+05:30

యూరిక్‌ యాసిడ్‌ స్థాయి పెరిగితే ప్రధానంగా ‘గౌట్‌’ అనే కీళ్ల సమస్య తలెత్తుతుంది. పెరిగే యూరిక్‌ యాసిడ్‌ కీళ్లలో స్ఫటికాల్లా తయారై ఆర్థరైటిస్‌ సమస్యను కలిగించడమే గౌట్‌!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ పెరగడాన్ని నిర్లక్ష్యం చేస్తే, ఆయుష్షులో 11 ఏళ్లు తరిగిపోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

యూరిక్‌ యాసిడ్‌ స్థాయి పెరిగితే ప్రధానంగా ‘గౌట్‌’ అనే కీళ్ల సమస్య తలెత్తుతుంది. పెరిగే యూరిక్‌ యాసిడ్‌ కీళ్లలో స్ఫటికాల్లా తయారై ఆర్థరైటిస్‌ సమస్యను కలిగించడమే గౌట్‌! అలాగే కొన్ని సందర్భాల్లో మూత్రపిండాల్లో రాళ్లు, కిడ్నీ ఫెయిల్యూర్‌కు కూడా అధిక యూరిక్‌ యాసిడ్‌ దారితీయవచ్చు. రక్తంలో పెరిగే యూరిక్‌ యాసిడ్‌ కారణంగా మొత్తం ఆయుష్షులో సుమారు 11 ఏళ్లు తరగిపోయే ప్రమాదం కూడా ఉందని యూరోపియన్‌ జర్నల్‌ ఆఫ్‌ ఇంటర్నల్‌ మెడిసిన్‌లో తాజాగా ఓ అధ్యయనం ప్రచురితమైంది.


అలాగే పెరిగే యూరిక్‌ యాసిడ్‌ స్థాయిలు హృద్రోగాలకూ, మధుమేహానికి కూడా దారితీయవచ్చు. కాబట్టి రక్తపరీక్షతో ఈ యాసిడ్‌ స్థాయిని పరీక్షించుకుంటూ, అధికంగా ఉన్నవారు ప్యూరిన్‌ రిచ్‌ ఫుడ్‌ మానివేయాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ కోవకు చెందినవాళ్లు పాలకూర, మష్రూమ్స్‌, రెడ్‌ మీట్‌, రొయ్యలు, టొమాటో, పెసరపప్పు, చాయపప్పు, సోయా, కాఫీలు మానేయాలని వైద్యులు చెబుతున్నారు. అలాగే శరీరంలోని అధిక యూరిక్‌ యాసిడ్‌ బయటకు వెళ్లేలా ఎక్కువగా నీళ్లు తాగాలని కూడా వారంటున్నారు. 


Updated Date - 2020-11-10T06:19:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising