ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరెన్సీతో కరోనా రాదు

ABN, First Publish Date - 2020-03-28T05:51:34+05:30

ప్రతి పనికి ముందు, తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవడం ద్వారా కరోనా దరిచేరకుండా చూసుకోవచ్చని రోజూ వింటూనే ఉన్నాం. మరి డబ్బులు ముట్టుకున్న తర్వాత కూడా చేతులు కడుక్కోవాలా?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రతి పనికి ముందు, తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవడం ద్వారా కరోనా దరిచేరకుండా చూసుకోవచ్చని రోజూ వింటూనే ఉన్నాం. మరి డబ్బులు ముట్టుకున్న తర్వాత కూడా చేతులు కడుక్కోవాలా? కరెన్సీ నోట్ల ద్వారా కూడా కరోనా వ్యాపిస్తుందా? ఇలాంటి సందేహాలు వచ్చిన ఇండేనేషియాకు చెందిన ఓ వ్యక్తి తన దగ్గరున్న కరెన్సీ నోట్లను బకెట్లో వేసి శుభ్రం చేసుకున్నాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లుకొడుతోంది. నిజంగానే కరెన్సీ నోట్లు, నాణేల ద్వారా కరోనా వ్యాపిస్తుందా? కరెన్సీ ద్వారా కరోనా వ్యాపిస్తుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేనప్పటికీ చాలామందికి ఇలాంటి వీడియోలు చూసినప్పుడు, చదివినప్పుడు సందేహం రాకమానదు. సాధారణంగా కరెన్సీ నోట్లు, నాణేల ద్వారా ఏదైనా బ్యాక్టీరియా, క్రిములు ఒకరి నుంచి మరొకరికి త్వరగా వ్యాపించడానికి అవకాశం ఉంటుంది. కానీ, కరోనా వైరస్‌ భిన్నమైంది. అది జీవించే వ్యవధి ఒక్కో రకం ఉపరితలం మీద ఒక్కోరకంగా ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కరెన్సీ నోట్లు, నాణేల ద్వారా కరోనా వ్యాపించదని చెబుతున్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం మంచిదే. వాటిని బకెట్లో వేసి కడగాలని నిపుణులెవరూ సూచించడం లేదుకానీ, ముట్టుకున్న తర్వాత మొహానికి చేతులు తగలకుండా చూసుకోవడం, శానిటైజర్‌ వాడటం, ఇంకా సేఫ్‌గా ఉండాలనుకుంటే డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు వాడటం మంచిది. అలాగే వాలెట్‌లు కూడా తరచూ మార్చకుండా ఒకటే ఉపయోగించడం శ్రేయస్కరం.

Updated Date - 2020-03-28T05:51:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising