ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ వైరస్‌కు దేశీ టెస్ట్‌కిట్‌

ABN, First Publish Date - 2020-03-25T06:26:58+05:30

కరోనా వైరస్‌(కొవిడ్‌ - 19) నిర్ధారణ కోసం కిట్‌ను రూపొందించినట్లు పుణెలోని ఒక సంస్థ తెలిపింది. దీనిని వాణిజ్య పరంగా ఉత్పత్తి చేయడానికి ‘సెంట్రల్‌ డ్రగ్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌’(సిడిఎస్‌ఒ) నుంచి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా వైరస్‌(కొవిడ్‌ - 19) నిర్ధారణ కోసం కిట్‌ను రూపొందించినట్లు పుణెలోని ఒక సంస్థ తెలిపింది.  దీనిని వాణిజ్య పరంగా ఉత్పత్తి చేయడానికి ‘సెంట్రల్‌ డ్రగ్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌’(సిడిఎస్‌ఒ) నుంచి అనుమతి లభించింది. ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ లో భాగంగా ప్రభుత్వ సహకారంతో దీనిని తయారు చేసినట్లు పుణెలోని మాలిక్యులర్‌ డయాగ్నస్టిక్స్‌ కంపెనీ ‘మైలాబ్‌ డిస్కవరీ సొల్యూషన్స్‌’ తెలిపింది. ఈ టెస్ట్‌ కిట్‌ ప్రపంచ ఆరోగ్య సంస్థ, సిడిసి మార్గదర్శకాల మేరకు ఉన్నట్లు పేర్కొంది. పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభం అయిన తరువాత ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ధరలో నాలుగో వంతు రేటుకే కొత్త కిట్‌ అందుబాటులోకి వస్తుంది. కరోనా వైరస్‌ పరీక్షల కోసం ఇప్పటికే ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసిఎమ్‌ఆర్‌) దేశవ్యాప్తంగా పదహారు ప్రైవేటు ల్యాబరేటరీలకు అనుమతించింది. పరీక్షల కోసం ఎంత వసూలు చేయాలో కూడా నిర్దేశించింది. ఒక శాంపుల్‌ పరీక్షకు 4500 రూపాయలు చార్జ్‌ చేయాలని తెలిపింది. ఇందులో స్ర్కీనింగు కోసం రూ.1500, కన్ఫర్మేషన్‌ కోసం రూ.3000.


 ప్రైవేటు రంగంలో ఈ పదహారు సంస్థలన్నింటికి కలిపి దేశవ్యాప్తంగా 15000 వరకు చైన్‌ ల్యాబరేటరీలు ఉన్నాయి. మరో రెండు చైన్‌ ల్యాబరేటరీల సంస్థలను కూడా ఇందులో చేర్చే ప్రక్రియ ప్రారంభమైందని ఐసిఎమ్‌ఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరామ్‌ భార్గవ్‌ చెప్పారు. 

Updated Date - 2020-03-25T06:26:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising